- స్కార్పియో X పేరుతో రానున్న ప్రొడక్షన్-రెడీ గ్లోబల్ పిక్ అప్
- గత సంవత్సరం ఇండియాలో పేటెంట్ చేయబడిన మోడల్
ఇండియాలో మహీంద్రా కంపెనీ కొత్త ట్రేడ్ మార్కుతో స్కార్పియో X అనే పేరును రిజిస్టర్ చేసింది, బహుశా రాబోయే మోడల్ పేరు ఇదే కావచ్చని అనుకుంటున్నాం. ఇంకా దీనిపై ఎలాంటి స్పష్టత రానప్పటికీ, గత సంవత్సరం గ్లోబల్ ఈ పేరు పిక్ అప్ కాన్సెప్టును మహీంద్రా కంపెనీ ఆవిష్కరించడంతో ఇది దాని కోసమే అని భావించవచ్చు.
గత సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్లోబల్ పిక్ అప్ కాన్సెప్టును మహీంద్రా అధికారికంగా వెల్లడించింది. స్కార్పియో ఎన్ ఎస్‍యూవీ ఆధారంగా వస్తున్న ప్రొడక్షన్-రెడీ వెర్షన్ పిక్ అప్ వెహికిల్ ని మహీంద్రా కంపెనీ 2025లో ఆవిష్కరించనుంది. గత సంవత్సరం ఈ మోడల్ టెస్ట్ మ్యూల్ టెస్టింగ్ చేస్తూ కనిపించగా, దీని డిజైన్ అంశాలను చూస్తే స్కార్పియో ఎన్ నుండి తీసుకున్నట్లు అనిపిస్తాయి మరియు టెయిల్ గేట్స్ ఫస్ట్-జెన్ స్కార్పియో నుండి తీసుకున్నట్లు అనిపిస్తాయి.
రానున్న రోజుల్లో స్కార్పియో Xగా పిలువబడే ఈ గ్లోబల్ పిక్ అప్ యొక్క న్యూ-జెన్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడి రానుంది. అలాగే, 4WD సిస్టంతో కూడా అందించబడుతుంది. స్కార్పియో X కారులో అందించబడే ఫీచర్లకు సంబంధించిన పూర్తి సమాచారం మేము మా కార్‌వాలే వెబ్ సైట్లో పొందుపరిచాము. మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్