- థార్ ఈవీ 2026లో వచ్చే అవకాశం
- 2 ఎలక్ట్రిక్ మోటార్స్ తో పవర్డ్ 60kWhబ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం
ఈ సంవత్సరం ఆగస్టులో, మహీంద్రా కంపెనీ తమ థార్ ఎస్‍యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన థార్.ఈని ప్రదర్శించింది. 2026లో ప్రొడక్షన్ రెడీగా అరంగేట్రం చేయనుండగా, దానికి ముందుగానే మహీంద్రా కంపెనీకి పుట్టినిల్లుగా ఉన్న ఇండియాలో ఈ మోడల్ కి సంబంధించి అన్నీ అనుమతులను పొందింది.
ఇక్కడ ఉన్న ఫోటోలను చూస్తే, అధికారిక థార్.ఈ మోడల్ కాన్సెప్టును మహీంద్రా మొదటిసారిగా సౌత్ ఆఫ్రికాలో ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రదర్శించింది. ఇది స్క్వేర్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, త్రీ స్లాట్ ఇన్సర్ట్స్ తో న్యూ గ్రిల్ మరియు థార్.ఈ బ్యాడ్జింగ్ కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, డ్యూయల్-టోన్ ఏరో వీల్స్, చంకీ వీల్ ఆర్చ్ మరియు ఫెండర్స్, బ్లాక్డ్-అవుట్ డి-పిల్లర్, మరియు ఒక టెయిల్ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి వాటిని కలిగి ఉంది.
లోపలి భాగాన్ని పరిశీలిస్తే, రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఎయిర్ ప్లేన్-స్టైల్డ్ గేర్ లీవర్, డ్రైవ్ మోడ్స్ కోసం రోటరీ డయల్, మరియు టచ్-బేస్డ్ కంట్రోల్స్ తో టూ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.
మహీంద్రా కంపెనీ థార్.ఈ మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ వెల్లడించకపోయినా, బ్రాండ్ యొక్క ఆర్కిటెక్చర్ ఇంగ్లో-ప్లాట్ ఫాం-1 ఆధారంగా రానుందన్న నిజాన్ని మాత్రం చెప్పేసింది. ఈ మోడల్ లోని ఒక్కో యాక్సిల్ పై 60kWh బ్యాటరీ ప్యాక్ జత చేయబడి రానుంది, ఇంతకు ముందున్నది 4WD ఫంక్షన్ వచ్చింది. ఇదే ఈవెంట్ లో మహీంద్రా కంపెనీ దాని ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలకు సంబంధించి కొత్త లోగోలను కూడా ఆవిష్కరించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్