- ఇండియాలో థార్ ప్రారంభ ధర రూ. 10.98 లక్షలు
- అందుబాటులోఉన్నవివిధ రకాల వేరియంట్స్ మరియు బాడీ స్టైల్స్
నవంబర్ 2023లో మహీంద్రా కార్లలో అప్‌డేట్ చేయబడిన వెయిటింగ్ పీరియడ్‌ను మేము పొందాము. మేము ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఎక్స్‌యువి700 వెయిటింగ్ టైమ్‌లైన్‌లను వివరించాము మరియు ఈ కథనంలో, థార్ యొక్క వివరాలను కూడా వెల్లడించబోతున్నాము.
నవంబర్ 2023 నాటికి, మహీంద్రా థార్ పై 70 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది ఆర్‍డబ్ల్యూడి హార్డ్-టాప్ డీజిల్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది, అయితే పెట్రోల్ వేరియంట్‌లకు 22 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సాఫ్ట్-టాప్ వెర్షన్‌లతో సహా 4డబ్ల్యూడి వేరియంట్‌లలో దేనినైనా బుక్ చేసుకునే కస్టమర్‌లు, బుకింగ్ తేదీ నుండి 24 వారాల వరకు వేచి ఉండాలి. ఈ టైమ్‌లైన్‌లు పాన్-ఇండియా స్థాయిలో అమలులో ఉన్నాయి.
ఈ సంవత్సరం సెప్టెంబరులో మహీంద్రా థార్ మోడల్ ధర రూ.43,500 వరకు పెరిగినప్పటికీ, ఈ మోడల్ కు అధిక డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ ఆగస్టు 2023 నాటికి, లైఫ్‍స్టైల్ ఎస్‌యువి దేశవ్యాప్తంగా 68,000 ఓపెన్ బుకింగ్‌లను నమోదు చేసింది.
అనువాదించిన వారు: రాజపుష్ప