- ఇండియాలో రూ.11.25 లక్షలతో ప్రారంభమైన థార్ ధరలు
- ఈ ఏడాది చివర్లో ఫైవ్ డోర్ వెర్షన్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం
మహీంద్రా లైఫ్‌స్టైల్ ఎస్‌యువిని ఇండియాలో లాంచ్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత కూడా థార్‌పై అధిక డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ఈ మోడల్ రెండు వేరియంట్‌లు మరియు రేంజ్ కలర్స్ లో అందుబాటులో ఉంది. అలాగే, దీనిని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జత చేయబడిన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ తో పొందవచ్చు.
ఈ నెలలో, థార్ పై సగటుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ 52 వారాలు లేదా 12 నెలల వరకు ఉంటుందని మహీంద్రా ఇటీవల వెల్లడించింది. అలాగే, ఆర్‍డబ్ల్యూడి వెర్షన్ పై మాత్రం అత్యధిక డిమాండ్ ఉండగా, ఈ టైమ్‌లైన్ దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.
అలాగే, ఫిబ్రవరి 2024 నాటికి, మహీంద్రా ఇంకా దాదాపు 2.26 లక్షల బుకింగ్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సంఖ్యలలో, ప్రస్తుతం బుకింగ్‌లు చేసిన 71,000 మంది వినియోగదారుల ఇళ్లకు థార్ ఇంకా చేరుకోలేదు. అంతేకాకుండా, ఈ మోడల్ ప్రతి నెలా 7,000 యూనిట్ల కొత్త బుకింగ్‌లను కొనసాగిస్తూనే ఉంది. ఈ సంవత్సరం తరువాత, ఈ బ్రాండ్ థార్ యొక్క ఫైవ్-డోర్ వెర్షన్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోంది, ఇది టెస్ట్ మ్యూల్స్ లో అనేక సందర్భాల్లో కనిపించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప