- జనవరిలో 78 శాతం పడిపోయిన జిమ్నీ సేల్స్
- జనవరిలో 6,059 థార్ యూనిట్లను విక్రయించిన మహీంద్రా
ఇండియాలో ప్రస్తుతం లైఫ్ స్టైల్ ఆఫ్-రోడ్ సెగ్మెంట్లో మహీంద్రా థార్ మరియు మారుతి సుజుకి జిమ్నీ సౌకర్యాన్ని అందిస్తూ మరియు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జిమ్నీతో పోలిస్తే మహీంద్రా థార్ కొద్దిగా ఎక్కువ కాలం నుంచి మార్కెట్లో ఉండగా, ఇక థార్ విషయానికి వస్తే, అందరూ అనుకున్నట్లుగానే సేల్స్ లో అధిక భాగాన్ని సొంతం చేసుకుంది. మొత్తానికి, గత కొన్ని నెలల నుంచి మారుతి జిమ్నీ సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి.
జనవరి-2024లో మారుతి సుజుకి దేశవ్యాప్తంగా కేవలం 163 జిమ్నీ యూనిట్లను మాత్రమే విక్రయించింది. మరోవైపు, మహీంద్రా 6,059 థార్ యూనిట్లను విక్రయించింది. మహీంద్రా కంపెనీ థార్ యొక్క మొత్తం సేల్స్ లో కేవలం 657పెట్రోల్ వెర్షన్ యూనిట్లను మాత్రమే విక్రయించడం గమనార్హం.
సేల్స్ | మహీంద్రా థార్ | మారుతి సుజుకి జిమ్నీ | వ్యత్యాసం |
జనవరి 2024 | 6,059 | 163 | 5,896 |
సేల్స్ ని ముందుకు కొనసాగించడానికి, మారుతి సుజుకి జిమ్నీ ఆఫ్-రోడర్ యొక్క థండర్ ఎడిషన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎస్‍యూవీ పూర్తి యాక్సెసరీస్ తో పాటుగా స్టాండర్డ్ ఎక్స్-షోరూం ధరపై రూ. 2 లక్షల డిస్కౌంట్లను కలిగి ఉంది. ఇప్పుడు, డిసెంబరులో మాత్రమే ఈ స్పెషల్ ఎడిషన్ విక్రయించబడగా మరియు సేల్స్ నుండి నిలిపివేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్