- ఇండియాలో ఆగస్టు 15న ప్రకటించబడనున్న థార్ రాక్స్ ధరలు
- పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో లభ్యం
మహీంద్రా ఆగస్టు15వ తేదీనాడు థార్ రాక్స్ ధరను వెల్లడించనుండగా, దానికంటే ముందుగా మహీంద్రా మరొక టీజర్‌ను రిలీజ్ చేసింది. అలాగే, లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ ఫైవ్-డోర్ ఇటరేషన్ ని ఈ నెల ప్రారంభంలో వివిధ టీజర్ వీడియోల ద్వారా వెల్లడించింది
కొత్త టీజర్‌లలో చూసినట్లుగా, కొత్త థార్ రాక్స్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ , హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు లాక్ చేయగల రియర్ డిఫరెన్షియల్ ఉంటాయి. మరోవైపు, ఇది పూర్తిగా డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇరువైపులా సర్క్యులర్ ఏసీ వెంట్స్, హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, వైట్ సీట్స్ మరియు డ్యాష్‌బోర్డ్ పై స్టిచింగ్ ని పొందగా, సెలెక్ట్ చేసిన ఏసీ ఫంక్షన్‌ల కోసం రోటరీ డయల్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
2024 థార్ రాక్స్ లో కొత్త సి-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ మరియు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, సర్క్యులర్ ఫాగ్ లైట్స్, ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంస్, బ్లైండ్-స్పాట్ మానిటర్స్, రియర్ డోర్ -మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయని మునుపటి టీజర్‌లు ఇప్పటికే నిర్ధారించాయి.
హుడ్ కింద, అప్ కమింగ్ (రాబోయే) మహీంద్రా థార్ రాక్స్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో అందించబడుతుందని భావిస్తున్నాం. అలాగే, ఇవి పెద్ద ఇంజిన్లుగా రానున్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6- స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ ఉండే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప