- అన్ని-ఎల్ఈడీ లైట్ సెటప్‌లను కలిగి ఉన్న మోడల్
- రూ. 16 లక్షలు ధర నుంచి ఉండవచ్చని అంచనా
థార్ రాక్స్ అని పిలువబడే ఫైవ్ -డోర్ థార్‌ను 15 ఆగస్టు 2024న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధంగా ఉంది.ఈ బ్రాండ్ ఆవిష్కరణ కోసం మేము వేచి ఉన్న సమయంలో, మహీంద్రా టీజర్ ద్వారా లైఫ్ స్టైల్ ఎస్‌యువిని వెల్లడించడం ప్రారంభించిందిమరియు తాజా టీజర్‌లో, ఫైవ్ -డోర్ థార్ ప్రొఫైల్ మరిన్ని ఎక్స్టీరియర్ అంశాలతో కనిపిస్తుంది.
త్రీ-డోర్ వెర్షన్‌తో పోల్చినప్పుడు, ఫైవ్ -డోర్ థార్ వెర్షన్ పెద్ద డైమెన్షన్లు కలిగి ఉంటుంది.అంతేకాకుండా, ఇది అన్ని-ఎల్ఈడీ లైట్ సెటప్‌లను కలిగి ఉండగా, ఇందులో 360-డిగ్రీల సరౌండ్ కెమెరా కోసం కెమెరా, ఒకే విధమైన డీఆర్ఎల్స్ తో సర్క్యులర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు రీడిజైన్ చేయబడిన గ్రిల్‌తో రివైజ్డ్ ఫ్రంట్ బంపర్ ని కలిగి, సహా ఉంటుంది.
ఫీచర్ల పరంగా చూస్తే, మహీంద్రా థార్ రాక్స్ అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు టాప్-ఎండ్ వేరియంట్‌ల కోసం పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌తో రానుంది. మార్కెట్లో దీనిపై ఉన్న అంచనాలను బట్టి మరియు కొత్త ఫీచర్ల జోడింపును పరిగణనలోకి తీసుకుంటే, థార్ రాక్స్ ధర రూ.16 లక్షలు మరియు రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.
అనువాదించిన వారు: రాజపుష్ప