- 15 ఆగస్టు, 2024న లాంచ్
- ప్రస్తుత మోడల్ కంటే మరిన్ని అప్ డేట్లతో పొందనున్న థార్ రాక్స్
ఎప్పటినుంచో ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫైవ్-డోర్ థార్ వెర్షన్ ని ఆటోమేకర్ మహీంద్రా 2024 ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయనుంది. లేటెస్టుగా, వివిధ టీజర్ల ద్వారా, ఫైవ్-డోర్ థార్ వెర్షన్ పేరు మరియు ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ వివరాలను వెల్లడించింది. దీంతో ఫైవ్-డోర్ థార్ వెర్షన్ పేరు మహీంద్రా థార్ రాక్స్ గా మారిపోయింది. ఇప్పుడు అధికారికంగా ధరను ప్రకటించక ముందు ఈ కొత్త లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ ఎవరూ ఊహించని రీతిలో పూర్తి లుక్ తో దర్శనమిచ్చింది.
స్పై షాట్ లో గుర్తించదగిన అంశం ఏంటి అంటే, ఎస్‍యూవీ పొడవు. ఇది ప్రస్తుత వెర్షన్ కంటే ఎక్కువ పొడవు ఉండగా, వీల్స్ బేస్ పొడిగించబడడంతో కారులో మరింత స్పేస్ ని అందించనుంది. ఇంకా, ఇతర డిజైన్ హైలైట్లలో కొత్త అల్లాయ్ వీల్స్, స్క్వేర్డ్-ఆఫ్ అర్చెస్, రీడిజైన్డ్ గ్రిల్ తో ఎత్తుగా ఉండే బానెట్, ఎ-పిల్లర్ మౌంటెడ్ ఓఆర్‌విఎం, మరియు పిల్లర్ తో అమర్చబడినట్లు ఉండే రియర్ డోర్ హ్యండిల్స్ వంటివి ఉన్నాయి.
ఫీచర్ల పరంగా చూస్తే, అప్ కమింగ్ థార్ రాక్స్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, 360-డిగ్రీ కెమెరా, వైట్ సీట్ అప్హోల్స్టరీ మరియు రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇంకా, సెలెక్ట్ చేసుకున్న వేరియంట్ ని బట్టి, థార్ రాక్స్ లో సింగిల్-పేన్ మరియు పనోరమిక్ సన్ రూఫ్ అనే రెండు రకాల సన్ రూఫ్ లు అందించబడతాయి.
మెకానికల్ గా, ఫైవ్-డోర్ మహీంద్రా థార్ రాక్స్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లతో వస్తుందని భావిస్తుండగా, ఈ ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి అందించబడతాయి. లాంచ్ అయిన తర్వాత, థార్ రాక్స్ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి జిమ్నీ మరియు ఫోర్స్ గూర్ఖా వంటి ఆఫ్-రోడింగ్ కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్