- రూ.12.99 లక్షలతో ధరలు ప్రారంభం
- ఆరు వేరియంట్లు మరియు ఏడు కలర్లలో లభ్యం
ఈ వారం ప్రారంభంలో, మహీంద్రా థార్ రాక్స్ ఎంట్రీ-లెవెల్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల ధరలను ప్రకటించగా, వీటి ఎక్స్-షోరూం ధరలు వరుసగా రూ.12.99 లక్షల నుంచి మరియు రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, నేడు మహీంద్రా థార్ రాక్స్ లో అందించిన మిగతా వేరియంట్ల వివరాలను మరియు వాటి ధరలను ప్రకటించింది.
ఇండియన్ ఆటోమేకర్ ఆర్డబ్లూడీ లైనప్ లో వచ్చిన ఎస్‍యూవీ వేరియంట్-వారీగా ధరలను వెల్లడించింది. ఇప్పుడు థార్ రాక్స్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో MX1, MX3, MX5, AX3L, AX5L మరియు AX7L వేరియంట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, దీనిని మీరు మొత్తం ఏడు కలర్లలో పొందవచ్చు. వీటన్నింటిలో బ్లాక్ రూఫ్ స్టాండర్డ్ గా వచ్చింది.
థార్ రాక్స్ లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉండగా, అందులో 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు2.2-లీటర్, ఫోర్-సిలిండర్, ఎంహాక్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 160bhp పవర్ మరియు 330Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజిన్ 150bhp పవర్ మరియు 330Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లు ఉన్నాయి. అలాగే, కస్టమర్లు వీటిని 4x2 వెర్షన్ లేదా 4x4 వెర్షన్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
బుకింగ్స్ అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, థార్ రాక్స్ టెస్ట్ డ్రైవ్ సెప్టెంబర్ 14 నుండి ప్రారంభమవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే, పండుగ సీజన్‌లో వీటి డెలివరీ షురూ వుతుంది. అంటే, ఈ ఫెస్టివ్ సీజన్ సమయానికి థార్ రాక్స్ మీ ఇంటికి వచ్చేస్తుందన్నమాట.
వేరియంట్-వారీగా కొత్త థార్ రాక్స్ ధరలు కింది విధంగా ఉన్నాయి:
థార్ రాక్స్ వేరియంట్ | ఇంజిన్ టైప్ | ఎక్స్-షోరూం ధర |
MX1 ఎంటి ఆర్డబ్లూడీ | పెట్రోల్ | రూ.12.99 లక్షలు |
MX3 ఎటి ఆర్డబ్లూడీ | పెట్రోల్ | రూ.14.99 లక్షలు |
MX1 ఎంటి ఆర్డబ్లూడీ | డీజిల్ | రూ.13.99 లక్షలు |
MX3 ఎంటి ఆర్డబ్లూడీ | డీజిల్ | రూ.15.99 లక్షలు |
MX5 ఎంటి ఆర్డబ్లూడీ | డీజిల్ | రూ.16.99 లక్షలు |
AX3L ఎంటి ఆర్డబ్లూడీ | డీజిల్ | రూ. 16.99 లక్షలు |
AX5L ఎటి ఆర్డబ్లూడీ | డీజిల్ | రూ. 18.99 లక్షలు |
AX7L ఎంటి ఆర్డబ్లూడీ | డీజిల్ | రూ. 18.99 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్