- 15వ తేదీ ఆగస్టు 2024న లాంచ్ కానున్న థార్ రాక్స్
- XUV700 మరియు స్కార్పియో N వంటి మోడల్స్ ఫీచర్లతో రానున్నథార్ రాక్స్
థార్ రాక్స్ ఎస్‌యూవీకి సంబంధించిన మరో టీజర్‌ను మహీంద్రా లేటెస్టుగా రిలీజ్ చేసింది. ఈసారి, కొత్త చిత్రంతో పనోరమిక్ సన్‌రూఫ్‌ను చేర్చనున్నట్లు ఆటోమేకర్ నిర్ధారించింది. దీనితో, థార్ రాక్స్ దాని కేటగిరిలో ఉన్న మోడల్స్ లో సన్‌రూఫ్ పొందిన మొట్ట మొదటి లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ అవుతుంది.
దీనిని దగ్గరగా చూసినట్లయితే, టీజర్ ఫోటోలుత్రీ –డోర్ థార్‌తో కనిపించే బ్లాక్ కలర్ సీట్లకు విరుద్ధంగా వైట్ కలర్ సీట్ అప్హోల్స్టరీ వంటి అదనపు సమాచారాన్ని వెల్లడిస్తుంది. అంతేకాకుండా, అన్ని హెడ్‌రెస్ట్‌లు అడ్జస్టబుల్‌గా కనిపించగా, మరియు డాష్‌బోర్డ్ పైన పెద్ద ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మౌంట్ చేయబడింది. ముఖ్యంగా చెప్పాలంటే, థార్ రాక్స్ సర్క్యులర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ను పొందుతుంది.
అంతే కాకుండా, కొత్త థార్ XUV700 మరియు స్కార్పియో N వంటి మోడల్స్ నుండి చాలా ఫీచర్లను తీసుకోవచ్చు. వీటిలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
మెకానికల్‍గా, ఫైవ్ –డోర్-థార్ రాక్స్ అందించబడే 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి కొనసాగుతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప