- హార్మన్ కార్డన్-బేస్డ్ మ్యూజిక్ సిస్టంతో వస్తున్న 5-డోర్ రాక్స్
- పనోరమిక్ సన్ రూఫ్ ని పొందనున్న రాక్స్ టాప్ వేరియంట్లు
ఆగస్టు 15వ తేదీన ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ లాంచ్ కానుండగా, దీనికి సంబంధించిన టీజర్లు మరియు ఫోటోలను మహీంద్రా కంపెనీ నిత్యం రిలీజ్ చేస్తూనే ఉంది. ఇవి కాస్త ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. ఆల్-న్యూ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ అధికారిక ధర ప్రకటనకు ముందు, మహీంద్రా రాక్స్ మోడల్ కి సంబంధించి మరో టీజర్ ని రిలీజ్ చేసింది. కొత్త టీజర్ ద్వారా ఫైవ్-డోర్ వెర్షన్ థార్ ఇంటీరియర్ కి సంబంధించి ఎన్నో కీలక వివరాలు మరియు ఫీచర్ లిస్టు వెల్లడైంది.
ఇక్కడ ఫోటోలో చూసిన విధంగా, థార్ రాక్స్ మోడల్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్ మరియు భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో రానుంది. ఈ రెండు ఫీచర్లు బ్రాండ్ నుంచి అందించబడిన ఫ్లాగ్ షిప్ మోడల్ XUV700 నుంచి తీసుకోబడ్డాయి. ఇంకా చెప్పాలంటే, థార్ రాక్స్ మోడల్ లోని టాప్-స్పెక్ వేరియంట్లు పనోరమిక్ సన్ రూఫ్, కాంట్రాస్టింగ్ స్టిచింగ్ తో డ్యాష్ బోర్డుపై సాఫ్ట్-టచ్ ఫినిషింగ్, మరియు హార్మన్ కార్డన్-బేస్డ్ మ్యూజిక్ సిస్టంతో వస్తున్నాయి.
ముఖ్యంగా, థార్ రాక్స్ మోడల్ ప్రస్తుత వెర్షన్ లో అందించబడిన బ్లాక్-కలర్డ్ అప్హోల్స్టరీని కాకుండా, కూల్డ్ ఫ్రంట్ సీట్లతో వైట్ సీట్ అప్హోల్స్టరీని పొందుతుంది. అదేవిధంగా, థార్ రాక్స్ లో ఇతర ఫీచర్లు కూడా అందించబడుతుండగా, అందులో పవర్డ్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్ లెస్ ఛార్జర్, మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

అనువాదించిన వారు: సంజయ్ కుమార్