ఫోర్స్ గూర్ఖాతో పోటీకి సిద్ధమైన థార్ 5-డోర్ వెర్షన్
పనోరమిక్ సన్ రూఫ్,360-డిగ్రీ కెమెరా, మరియు లెవెల్-2 ఎడాస్ తో పాటుగా మరిన్ని ఫీచర్లతో వస్తున్న థార్ రాక్స్
ఎన్నో రోజులు లేదు, ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకో తెలుసా! అదేనండీ గత కొన్ని నెలల పాటుగా కొత్త కొత్త టీజర్లతో అదరగొడుతున్న మహీంద్రా థార్ రాక్స్ ఆగస్టు 15వ తేదీన లాంచ్ కాబోతుంది. ఇంతకు ముందున్న ఆఫ్-రోడ్ ఎస్‍యూవీ వలె ఈ కొత్త వెర్షన్ ని మహీంద్రా లాంచ్ చేయబోతుంది. లేటెస్టుగా ఇంటర్నెట్లో థార్ రాక్స్ కి సంబంధించిన టీజర్లు దీనిపై మరింత క్రేజ్ ని పెంచేలా చేస్తున్నాయి.
ఫోటోలలో చూసినట్లుగా, అప్ కమింగ్ థార్ రాక్స్ కొత్తగా వైట్ ఎక్స్‌టీరియర్ కలర్ లో రాబోతుంది. బహుశా దీనిని ఎవరెస్ట్ వైట్ కలర్ ని పిలిచే అవకాశం ఉంది. ఇదే కలర్ ని ఇంతకు ముందు మనం మహీంద్రా 3-డోర్ వెర్షన్లో చూశాం. అలాగే, గతంలో రిలీజైన టీజర్ ని చూసినప్పుడు, ఈ ఎస్‍యూవీ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్లో వస్తున్నట్లు తెలిసింది.
ఇంకా ఎక్స్‌టీరియర్ హైలైట్లను పరిశీలిస్తే, కొత్త థార్ రాక్స్ పొడవైన వీల్‌బేస్, పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, కొత్త స్లాట్ గ్రిల్‌తో రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, 360-డిగ్రీ కెమెరా మరియు చుట్టూ అంతటా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో సర్క్యులర్ డీఆర్ఎల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఇంకా ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త టీజర్లను చూస్తే, మహీంద్రా థార్ రాక్స్ లో భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, హార్మన్ కార్డన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టం, కొత్త స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైట్ సీట్ అప్హోల్స్టరీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లెవెల్-2ఎడాస్ (ఏడీఏఎస్)సూట్ వంటి ఫీచర్లతో వస్తున్నట్లు వెల్లడైంది. లాంచ్ అయిన తర్వాత, ఆఫ్-రోడర్ థార్ రాక్స్ మారుతి జిమ్నీ మరియు ఫైవ్-డోర్ ఫోర్స్ గూర్ఖావంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్