- ఇండియాలో రూ.12.99 లక్షలతో థార్ రాక్స్ ధరలు ప్రారంభం
- వేరియంట్-వారీగా నేడే థార్ రాక్స్ ధరలను ప్రకటించిన మహీంద్రా
కొన్ని గంటల క్రితమే, మహీంద్రా కంపెనీ థార్ రాక్స్ ని లాంచ్ చేసి ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ కొంచెం ముందుగానే ప్రారంభించింది. లాంచ్ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా థార్ రాక్స్ హాట్ టాపిక్ గా మారింది, ఎందుకంటే ఇందులో అందించిన ఫీచర్లు అలా ఉన్నాయ్ మరి! నిన్న అనగా బుధవారం రోజు మహీంద్రా థార్ రాక్స్ బేస్ వేరియంట్ ధరలను ప్రకటించగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. లాంచ్ సమయంలో ధరలను ప్రకటించడమే కాకుండా, మహీంద్రా థార్ రాక్స్ MX1 బేస్ వేరియంట్లో అందించిన కీలక ఫీచర్ల వివరాలను కూడా వెల్లడించింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ముందుగా 2024 థార్ రాక్స్ ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే, కారు బయట వైపు డ్యూయల్-టోన్ మెటల్ టాప్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు 18-ఇంచ్ స్టీల్ వీల్స్ వంటి వాటితో దీని లుక్ కళ్ళు చెదిరేలా ఉంది. ఇంటీరియర్ పరంగా, థార్ రాక్ లోపల చూస్తే, ఎస్‍యూవీ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, రియర్ ఏసీ వెంట్స్, యుఎస్‍బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలెక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్, మరియు ఫాబ్రిక్ అప్హోల్స్టరీ వంటి బ్రహ్మాండమైన ఫీచర్లతో వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, థార్ రాక్స్ లోని వేరియంట్-లైనప్ అంతా 6 ఎయిర్ బ్యాగ్స్ ని పొందాయి. అంటే, కారులో సేఫ్టీకి ఎలాంటి డోకా లేదనమాట.
మహీంద్రా థార్ రాక్స్ ఎంట్రీ లెవెల్ MX1 బేస్ వేరియంట్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. అందులో 160bhp పవర్ మరియు 330Nm టార్కును ఉత్పత్తి చేసే 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 150bhp పవర్ మరియు 330Nm టార్కును ఉత్పత్తి చేసే 2.2-లీటర్, ఫోర్-సిలిండర్, ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్ గా రాగా, ఈ వెర్షన్లు 4x2 టైపులో లభిస్తాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్