- థార్ రాక్స్ బేస్ వేరియంట్ల ధరలను ప్రకటించిన మహీంద్రా
- 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లతో వచ్చిన ఆఫ్-రోడర్ రాక్స్
థార్ రాక్స్ లాంచ్ ఈవెంట్ చూస్తుంటే, ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ ఒకరోజు ముందుగానే మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు మహీంద్రా కంపెనీ థార్ రాక్స్ గా పిలువబడుతున్న థార్ ఫైవ్-డోర్ వెర్షన్ ని మహీంద్రా కంపెనీ ఇండియాలో లాంచ్ చేయగా, వీటి ధరలు రూ.12.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో ప్రారంభమయ్యాయి.
ఎంట్రీ లెవల్ MX1 పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 12.99 లక్షలు ఉండగా, ఎంట్రీ లెవెల్ MX1 డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 13.99 లక్షలుగా మహీంద్రా నిర్ణయించింది. ఇతర వేరియంట్ల ధరలు రేపు ప్రకటిస్తామని మహీంద్రా థార్ రాక్స్ లాంచ్ ఈవెంట్లో పేర్కొంది. ఈ వెర్షన్ త్రీ-డోర్ ఇటరేషన్ ఆధారంగా రాగా, ప్రాక్టికల్ గా ఇది రెండు అదనపు డోర్లు మరియు రెండవ వరుసలో బెంచ్ సీట్ లేఅవుట్ వంటి వాటితో అందించబడుతుంది. బెస్ట్ ఆఫ్-రోడర్ కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు థార్ రాక్స్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
పవర్ ట్రెయిన్స్
పవర్ ట్రెయిన్ ఆప్షన్ల పరంగా, థార్ రాక్స్ పెట్రోల్ మోడల్ 160bhp పవర్మరియు 330Nmటార్కును ఉత్పత్తి చేసే 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే, రాక్స్ డీజిల్ మోడల్ 150bhp పవర్మరియు 330Nmటార్కును ఉత్పత్తి చేసే 2.2-లీటర్, ఫోర్-సిలిండర్, ఎంహాక్ డీజిల్ ఇంజిన్ తో అందించబడింది. కస్టమర్లు వీటిని 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జతచేసి పొందవచ్చు.
డిజైన్ హైలైట్స్
ఎక్స్‌టీరియర్ పరంగా, 2024 మహీంద్రా థార్ రాక్స్ కారు బయటి భాగంలో కొత్త గ్రిల్, సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సర్క్యులర్ ఫాగ్ లైట్లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు రియర్ డోర్-మౌంటెడ్ హ్యాండిల్స్ వంటి వాటిని కలిగి ఉంది. కారు వెనుక భాగంలో, ఇది రెక్టాంగులర్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ మరియు టెయిల్ గేట్ –మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి వాటితో బెస్ట్ లుక్ ని పొందింది.
కొత్త థార్ రాక్స్ లోపలికి వెళ్లి చూస్తే, అందులో మీరు చాలా రకాలైన ఫీచర్లను గమనించవచ్చు. అందులో కొత్త 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీవెంట్స్ మరియు డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే కారును మేము డ్రైవ్ చేస్తున్నాము. మరికొన్ని రోజుల్లో దీని పూర్తి రివ్యూ అందరికి అందుబాటులోకి వస్తుంది. మహీంద్రా థార్ రాక్స్ మరియు ఇతర కార్ల వివరాలను తెలుసుకోవడానికి మా కార్ వాలే వెబ్ సైట్ ని మరియు కార్ వాలే సోషల్ మీడియా పేజీలను నిరంతం సందర్శిస్తూ ఉండండి.
పోటీ
థార్ రాక్స్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఎంజి ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ వంటి కార్లతో పోటీపడుతుంది.
నేడు మహీంద్రా ప్రకటించిన థార్ రాక్స్ బేస్ వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
బేస్ వేరియంట్లు | ఎక్స్-షోరూం ధరలు |
మహీంద్రా థార్ రాక్స్ MX1 పెట్రోల్ ఎంటి | రూ.12.99 లక్షలు |
మహీంద్రా థార్ రాక్స్ MX1 డీజిల్ ఎంటి | రూ.13.99 లక్షలు |