- సింగిల్-పేన్ సన్ రూఫ్ తో వస్తున్న థార్ రాక్స్
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైట్ అప్హోల్స్టరీ, భారీ టచ్ స్క్రీన్, మరియు కొత్త స్టీరింగ్ వీల్
స్వాతంత్ర్య దినోత్సవాన్ని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు మహీంద్రా కంపెనీ దాని కొత్త ప్రొడక్టు అయిన థార్ రాక్స్ ని ఇండియాలో లాంచ్ చేస్తుంది. 5-డోర్ వెర్షన్ థార్ దాని మార్కును ప్రదర్శించేందుకు ఇండియన్ మార్కెట్లో ఆగస్టు 15వ తేదీన రానుంది. దీనికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీని అధికారిక ప్రకటనకు ముందు మహీంద్రా కంపెనీ థార్ రాక్స్ ఎస్‍యూవీపై మరింత హైప్ ని పెంచేలా దీనికి సంబంధించిన ఎక్స్‌టీరియర్ మరియు కొద్దిపాటి ఫీచర్లను వివిధ టీజర్ల ద్వారా ప్రదర్శించడం ప్రారంభించింది. అయితే, రాక్స్ క్యాబిన్ కి సంబంధించిన స్పై ఫోటోలు కూడా ఇప్పుడు బయటికి రావడంతో, దీని ద్వారా మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి.
ఫోటోలో చూసిన విధంగా, ఇందులో మొదట గుర్తించదగిన అంశం ఏంటి అంటే, థార్ రాక్స్ క్యాబిన్ కొత్త వైట్ అప్హోల్స్టరీని కలిగి ఉంది. ఇది XUV700ని తలపిస్తుండగా, ఫ్రంట్ సీట్లలో వెంటిలేషన్ ఫంక్షన్ ని పొందే అవకాశం ఉంది. ఇప్పుడు. ఈ ఎస్‍యూవీ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని, మెయింటెనెన్స్ శ్రమను తగ్గించేలా లైట్ కలర్ సీట్లతో అందించబడుతుంది.
ఇక్కడ చెబుతున్నది ఏంటి అంటే, కొత్త థార్ క్యాబిన్ అత్యాధునిక ఫీచర్లతో రానుంది. అందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, బెజెల్-లెస్ ఐఆర్‌విఎం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కొత్త స్టీరింగ్ వీల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. థార్ రాక్స్ లేటెస్టు అధికారిక టీజర్ లో వెల్లడైంది ఏంటి అంటే, టాప్-స్పెక్ వెర్షన్లలో పనోరమిక్ సన్‌రూఫ్ చేర్చబడింది అని మరియు ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, స్పై ఫోటోలలో కనిపించింది మాత్రం లోయర్-స్పెక్ వెర్షన్.
ఇంకా చెప్పాలంటే, అప్ కమింగ్ థార్ రాక్స్ ప్యాసింజర్లు అందరికీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, స్ప్లిట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రెండవ వరుసలో ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, మరియు రూఫ్ మౌంటెడ్ రియర్ స్పీకర్స్ వంటి ఫీచర్లను పొందనుంది. అలాగే, ప్రస్తుత థార్ లో చూసినట్లుగా ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ ఇందులో కనిపించగా, మరో క్లూ ఏంటి అంటే, ఇక్కడ కనిపించింది లోయర్ స్పెక్ వెర్షన్ థార్ రాక్స్.
మెకానికల్ గా, ఇంతకు ముందున్న పవర్ ట్రెయిన్లే థార్ రాక్స్ లో కూడా రానున్నాయి. అయితే, థార్ కొత్త ఇటరేషన్ ఆర్డబ్లూడీరూపంలో అందించబడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. లాంచ్ అయిన తర్వాత, థార్ రాక్స్ 5-డోర్ వెర్షన్లలో వచ్చిన మారుతి సుజుకి జిమ్నీ మరియు ఫోర్స్ గూర్ఖా కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్