- 15 ఆగస్టు నెలలో లాంచ్ కానున్న థార్ రాక్స్
- పనోరమిక్ సన్‌రూఫ్ తో అందించబడుతున్న మోడల్
కొద్ది రోజుల క్రితం, మహీంద్రా ఫైవ్ -డోర్ థార్ వెర్షన్ కు థార్ రాక్స్అనే పేరుతో పరిచయం చేసి మన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ కి పోటీగా ఉన్న దీని ధరలు 15 ఆగస్టు, 2024న ప్రకటించబడతాయి. అదే విధంగా ఈ కార్ డెలివరీ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరొక ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే, థార్ రాక్స్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మహీంద్రా వెల్లడించింది. వీడియోలో చూపిన కారును చూస్తే, లైఫ్‌స్టైల్ ఎస్‌యువిలోని ముఖమైన ఎక్స్‌టీరియర్ ఫీచర్లు, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఎంజి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటితో పోటీపడేలా ఉన్నాయి.
త్రీ –డోర్ ఇటరేషన్ తో పోలిస్తే, థార్ ఫైవ్-డోర్ లేదా థార్ రాక్స్ రివైజ్డ్ ఫాసియాను పొందింది, ఇందులో గ్రిల్ కోసం కొత్త డిజైన్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ తో కూడిన సర్క్యులర్ హెడ్‌ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సర్క్యులర్ ఫాగ్ లైట్స్ మరియు బంపర్‌కి చిన్నచిన్న డిజైన్ మార్పులను కలిగి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, గ్రిల్‌లో ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడింది.
ఇందులోని ఇతర హైలైట్లలో, ఇది ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, 'థార్' బ్రాండింగ్‌తో ఫ్రంట్ డోర్ -మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, చంకీ వీల్ క్లాడింగ్ మరియు సైడ్ స్టెప్స్ వంటి మరి కొన్ని అంశాలను పొందగా, అదే విధంగా ఇందులో, మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, పెద్ద వీల్‌బేస్, సి-పిల్లర్-మౌంటెడ్ బాడీ-కలర్డ్ రియర్ డోర్ హ్యాండిల్స్ మరియు రియర్ క్వార్టర్ గ్లాస్ రూపంలో అప్‌డేట్‌లు ఉన్నాయి. అయితే వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో కూడిన సి-షేప్డ్ బ్రేక్ లైట్, సైడ్ ప్రొఫైల్ కూడా సిగ్నేచర్ 4x4 బ్యాడ్జింగ్ ని వంటివి ఉన్నాయి .
మహీంద్రా ఇంకా ఇంటీరియర్ మరియు పూర్తి ఫీచర్ లిస్ట్ ను వెల్లడించనప్పటికీ, 2024 థార్ రాక్స్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప