- రూ. 16.99 లక్షల నుండి ధరలు ప్రారంభం
- 6 వేరియంట్స్ మరియు 7 కలర్స్ లో అందించబడుతున్న మోడల్
మహీంద్రా తాజాగా థార్ రాక్స్ AX3L వేరియంట్లో లభించే కీలక ఫీచర్ల వివరాలను వీడియో ద్వారా షేర్ చేసింది. ప్రత్యేకంగా డీజిల్ వేరియంట్లో లభిస్తున్న ఎంటి 2డబ్ల్యూడి కీలక ఫీచర్లను వీడియో ద్వారా మహీంద్రా వెల్లడించింది. దీనిని రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. ఈ మోడల్ ను 6 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, థార్ రాక్స్ AX3L వేరియంట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డిఆర్ఎల్స్ , సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, సి-షేప్డ్ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, స్పేర్ వీల్ కవర్ మరియు 18-ఇంచ్ స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, ఈ వేరియంట్ లోపలి భాగంలో, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, వైర్‌లెస్ ఛార్జర్, 6 యిర్‌బ్యాగ్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, పవర్ విండోస్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటివి ఉన్నాయి.
టాప్-స్పెక్ AX7L వేరియంట్‌తో పోలిస్తే, రూ.18.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉన్న డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆర్‍డబ్ల్యూడి వేరియంట్ కారు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ , సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అల్లాయ్ వీల్స్, టిపిఎంఎస్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ వంటి ఫీచర్లను మిస్ అవుతుంది.
థార్ రాక్స్ AX3L వేరియంట్‌లోని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 150bhp మరియు 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జత చేయబడింది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు రకాలుగా అందించబడుతుంది. అలాగే, ఇంతకు ముందు పేర్కొన్న అదే డీజిల్ ఇంజిన్ కోసం మరొక అధిక అవుట్‌పుట్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప