- రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడుతున్న థార్ రాక్స్
- రూ.12.99 లక్షలతో ప్రారంభమైన ధరలు
ఇటీవల మహీంద్రా ఇండియా థార్ రాక్స్ ను ఇండియన్ మార్కెట్లో రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త ఆఫ్-రోడర్ చుట్టూ ఉన్న హైప్‌ను పరిశీలిస్తే, థార్ రాక్స్ లో అందించిన వివిధ అంశాలు చాలా ఉన్నాయి. అలాగే, థార్ రాక్స్ గురించి అడిగే ప్రశ్నలలో ఒకటి, మరియు అత్యధికంగా అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఫైవ్ -డోర్ థార్ రాక్స్ సర్టిఫైడ్ మైలేజ్ ఎంత ఇస్తుందిఅని ? ఇప్పుడు, మేము థార్ రాక్స్ ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజీని పొందాము. వాటి వివరాలను పరిశీలిద్దాం.
సరికొత్త థార్ రాక్స్ 2.2-లీటర్ టిజిడిఐ పెట్రోల్ మరియు 2.0-లీటర్ సిఆర్ డిఐ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో లభిస్తుంది. ఈ రెండు మోటార్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడ్డాయి.
మైలేజ్ విషయానికొస్తే, పెట్రోల్ మోటార్ 12.4 కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-క్లెయిమ్ చేసిన ఫ్యూయల్ ఎఫిషియన్సీ మైలేజీని అందిస్తుంది. మరోవైపు, డీజిల్ ఇంజిన్ 15.2కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ పేర్కొన్న నెంబర్లు ఏఆర్ఏఐ ద్వారా అధికారికంగా క్లెయిమ్ చేసిన నెంబర్లు అని గమనించండి. దీనికి అదనంగా, మేము 4x2 టైపు డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ చేయడం ద్వారా ఫ్యూయల్ ఎఫిషియన్సీ నెంబర్లను కూడా పొందాము.
మేము నిర్వహించిన టెస్టులలో, థార్ రాక్స్ సిటీలో మరియు హైవే రోడ్లపై వరుసగా 10.82కెఎంపిఎల్ మరియు 15.44కెఎంపిఎల్ మైలేజీని ఇచ్చింది. ఈ మొత్తం నెంబర్లను యావరేజ్ గా చూస్తే, 11.97కెఎంపిఎల్ వరకు ఉంది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మహీంద్రా క్లెయిమ్ చేసిన నంబర్లలో మరియు ఇప్పుడు అందించిన రియల్ వరల్డ్ నంబర్లలో పెద్దగా తేడాలు లేవు.
అనువాదించిన వారు: రాజపుష్ప