- మహీంద్రా బ్రాండ్ నుండి వచ్చిన ఇతర మోడల్స్ పై కూడా పెరిగిన ధరలు
- పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, పెరిగిన కమొడిటీ ధరలే ధరలలో మార్పుకు కారణం
గత నెలలో, కొత్త సంవత్సరం 2024లో ఇండియాలో తమ మోడల్స్ పై ధరలను పెంచుతున్న వివిధ కంపెనీలలో మహీంద్రా కంపెనీ కూడా ఒకటిగా నిలిచింది. మహీంద్రా తన మోడల్స్ రేంజ్ లో ఉన్న స్కార్పియో, స్కార్పియో ఎన్, థార్, మరియు బొలెరో లైనప్ కి సంబంధించిన అప్‍డేటెడ్ ధరల వివరాలను మేము కలిగి ఉన్నాము.
ఇక మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఈ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ ధరలు రూ.34,699 వరకు పెరగగా, పెరిగిన ధర AX(O) హార్డ్-టాప్ డీజిల్ ఎంటి 4డబ్ల్యూడీపై వరిస్తుంది. అదే విధంగా, ఎంట్రీ-లెవెల్ LXహార్డ్-టాప్ పెట్రోల్ ఎటి ఆర్‌డబ్ల్యూడీపై స్వల్పంగా రూ.22,899 పెరిగింది.
ప్రస్తుతం, మహీంద్రా థార్ రేంజ్ లోని బేస్ లెవెల్ LXహార్డ్-టాప్ పెట్రోల్ ఎటి ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర రూ.14 లక్షలు నుండి ప్రారంభమై టాప్-స్పెక్ LXహార్డ్-టాప్ డీజిల్ ఎటి 4డబ్ల్యూడీ ధర రూ.17.20 లక్షలు వరకు ఉంది. ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ మహీంద్రా 5-డోర్ థార్ ని ఈ సంవత్సరం తర్వాత లాంచ్ చేయాలని భావిస్తుండగా, దీని కంటే ముందుగా XUV300ఫేస్‍లిఫ్ట్ ని పరిచయం చేసే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్