- రూ. 14.10 లక్షలు ప్రారంభ ధరతో ఇప్పుడు థార్ లభ్యం
- ఈ ఏడాది చివర్లో 5-డోర్ వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశం
మహీంద్రా సెలెక్ట్ చేసిన కార్ల ధరలను తక్షణం అమల్లోకి తెచ్చింది. ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసిన మోడళ్లపై ధరలను పెంచింది. అలాగే, ఈ కథనంలో, థార్ లైఫ్‌స్టైల్ ఎస్‌యువికి మాత్రమే వర్తించే ఈ ధర మార్పును మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
మహీంద్రా థార్ సెలెక్టెడ్ వేరియంట్‌లపై మాత్రమే రూ. 10వేల వరకు ధర పెరిగింది. తదుపరి, బేస్-స్పెక్ LX హార్డ్-టాప్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆర్‍డబ్ల్యూడి, AX(O) హార్డ్-టాప్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆర్‍డబ్ల్యూడి మరియు LX హార్డ్-టాప్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆర్‍డబ్ల్యూడి పై ధరలు పెరిగాయి, అలాగే అన్ని ఇతర వెర్షన్స్ పై ధరలలో ఎటువంటి మార్పులు లేవు.
ధరలు పెరిగిన తర్వాత , మహీంద్రా థార్ ఇప్పుడు, వరుసగా AX(O) హార్డ్-టాప్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆర్‍డబ్ల్యూడి మరియు ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 4డబ్ల్యూడి వేరియంట్స్ ధరలు వరుసగా రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప