- త్వరలో థార్ త్రీ-డోర్ వెర్షన్ జతచేరనున్న ఫైవ్ –డోర్ వెర్షన్
- మే 2024లో బుకింగ్ సంఖ్య 59,000 యూనిట్లుగా ఉన్న థార్
జూలై 2024 నాటికి మహీంద్రా కార్ల పెండింగ్ ఆర్డర్ల బుక్ మా చేతుల్లోకి వచ్చింది. ఈ కథనంలో, మహీంద్రాకంపెనీ నుంచి వస్తున్న లైఫ్‌స్టైల్ ఎస్యువి, థార్, రేంజ్ బుకింగ్స్ గణనీయంగా తగ్గడంతో, దీనికి సంబంధించిన సంఖ్యలను మనం పరిశీలిద్దాం.
గత నెలలో, మహీంద్రా నుంచి వస్తున్న ఒక్క థార్‌పై మాత్రమే 42,000 యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, మే 2024 నాటికి ఈ బ్రాండ్ డెలివరీ చేయాల్సిన 59,000 యూనిట్లతో పోలిస్తే, ఇది మరింత తగ్గింది ఫలితంగా 2 నెలల్లోనే దాదాపు 29 శాతం వరకు బుకింగ్స్ తగ్గాయి.
ముఖ్యంగా చెప్పాలంటే, థార్ త్రీ-డోర్ ప్రతి నెలా 5,000 యూనిట్ల కొత్త బుకింగ్‌లను పొందుతూనే ఉంది. ఫైవ్-డోర్ వెర్షన్ పేరుఇప్పుడు థార్ రాక్స్ గా మారడంతో , ఇప్పుడు ఈ సంఖ్య మరింతపెరుగుతుంది. రెండోది థార్ రాక్స్ లాంచ్ ఆగస్టు 15న జరగనుండగా, దాని కంటే ముందే దీనికి సంబంధించిన కొన్ని అంశాలు వెల్లడయ్యాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప