- థార్ ను బహుమతిగా స్వీకరించాలని సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని కోరిన మహీంద్రా గ్రూప్ చైర్మన్
- ఆటో ఇండస్ట్రీలో బెస్ట్ సెల్లర్ గా కొనసాగుతున్న థార్ ఎస్‍యూవీ
గత కొన్ని రోజులుగా దేశమంతా ఒకే పేరు వినిపిస్తుంది, అతడే సర్ఫరాజ్ ఖాన్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన అద్బుత ప్రదర్శనతో ఇండియన్ ఫాన్స్ తో పాటుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా మెప్పించాడు. ఎప్పుడూ ట్విట్టర్(ఎక్స్)లో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా ఇండియన్ క్రికెట్ టీం విజయాలను ప్రోత్సహిస్తూ, అందులో కీలక పాత్ర పోషించే క్రికెటర్లకు కొన్నేళ్ళ నుంచి మహీంద్రా కార్లను బహుమతిగా అందిస్తున్నాడు. అయితే తాజాగా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ కష్టానికి మెచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా థార్ ఎస్‍యూవీని బహుమతిగా అందించనున్నట్లు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ప్రకటించాడు.
సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ లైఫ్
తాజాగా సర్ఫరాజ్ ఖాన్ రంజీ క్రికెట్లో మరియు ఇంగ్లాండ్-ఎ జట్టుతో ఆడి మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా చివరి మూడు టెస్టులకు ఎంపికయ్యాడు. ఇక ఈ మూడవ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్ లో వరుసగా హాఫ్ సెంచరీలు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మహీంద్రా థార్ ఇంజిన్ & స్పెసిఫికేషన్స్
ఇక ఆఫ్-రోడర్ మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇండియన్ కస్టమర్ల నుంచి అద్బుత స్పందన మరియు ఆదరణ లభిస్తుండడంతో ఆటో మార్కెట్లో రోజురోజుకు థార్ సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం, దీని ఖరీదు అక్షరాల 11.25 లక్షల రూపాయలుగా ఉంది (ఎక్స్-షోరూం ధర). దీనిని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లతో పొందవచ్చు. అలాగే ఇది RWD మరియు 4WD కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంది. మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ మహీంద్రా థార్ మరియు ఇతర కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా కార్‌వాలే వెబ్ సైట్ ని సందర్శించగలరు.