- స్కార్పియో Nతో కలర్ పరిచయం
- ఇప్పుడు మొత్తం 6 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో అందించబడుతున్న థార్
మహీంద్రా నుంచి మార్కెట్లో మోస్ట్ పాపులర్ అయిన ఎస్‌యువిలలో ఒకటైన థార్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లలో మహీంద్రా కంపెనీ కొన్ని మార్పులను చేసింది. ఈ లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్‌ను ఇప్పుడు 'డీప్ ఫారెస్ట్' అనే కొత్త కలర్ తో పాటు మరో 5 పెయింట్ ఆప్షన్‌లతో పొందవచ్చు.
మహీంద్రా థార్ ఇప్పుడు రెడ్ రేజ్, డీప్ గ్రే, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, డెసర్ట్ ఫ్యూరీ మరియు డీప్ ఫారెస్ట్ వంటి 6 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో అందుబాటులో ఉంది. వీటిలో, మూడు థార్ కలర్ రేంజ్ లో సరికొత్తగా తరువాత చేర్చినవి.
పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో RWD మరియు 4WD అనే రెండు రూపాల్లో థార్‌ని కలిగి ఉండవచ్చు.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | పవర్ అవుట్‌పుట్ |
1.5-లీటర్ డీజిల్ | 6-స్పీడ్ మాన్యువల్ | 117bhp/300Nm |
2.2- లీటర్ డీజిల్ | 6-స్పీడ్ మాన్యువల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ | 130bhp/300Nm - |
2.0- లీటర్ డీజిల్ | 6-స్పీడ్ మాన్యువల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ | 150bhp/300Nm 150bhp/320Nm |
ఇటీవలి వార్తలలో, ఇండియన్ ఆటోమేకర్ థార్ ధరలను రూ.10,000 వరకు పెంచగా, దీనితో ఇప్పుడు ఎస్‌యువి రేంజ్ ధర రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప