- ఇండియాలో రూ.43,500 వరకు పెరిగిన థార్ ధరలు
- అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్ మరియు 5 కలర్స్
మహీంద్రా బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్ థార్ ధరలు ఈ నెలలో పెరిగాయి. దీనితో పాటు స్కార్పియో ఎన్, ఎక్స్యువి700, మరియు స్కార్పియో క్లాసిక్ వంటి 2-డోర్ లైఫ్ స్టైల్ ఎస్యువిలపై ధరలు అమాంతం రూ.43,000 వరకు పెరిగాయి.
AX (O) హార్డ్-టాప్ డీజిల్ ఎంటి ఆర్ డబ్ల్యూడీ మరియు LX హార్డ్-టాప్ డీజిల్ ఎంటి ఆర్ డబ్ల్యూడీ వెర్షన్స్ ఒక్కో దానిపై రూ.43,500 వరకు పెరిగాయి. అదే విధంగా, ఎంట్రీ లెవెల్ LX హార్డ్-టాప్ పెట్రోల్ ఏటీ ఆర్డబ్ల్యూడీ వెర్షన్ పై రూ. 28,001 వరకు పెరిగాయి. అలాగే అన్నీ ఇతర వెర్షన్స్ పై రూ. 16,200 వరకు ధరలు పెరిగాయి.
ప్రస్తుతం, మహీంద్రా థార్ 2-డోర్, 4-సీట్ కాన్ఫిగరేషన్లో మాత్రమే అందించబడుతుంది. కానీ, ఎప్పటి నుంచో వేచి చూస్తున్న 5-డోర్, 5-సీట్ మహీంద్రా థార్ వచ్చే సంవత్సరం మార్కెట్లోకి ప్రవేశించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్