- నాలుగు వేరియంట్లలో లభ్యం
- కొత్త డెజర్ట్ ఫ్యూరీ సాటిన్ మ్యాట్ కలర్ దీని ప్రత్యేకత
మహీంద్రా కంపెనీ థార్ లైనప్ లోకి మరో కొత్త ఇటరేషన్ ని ప్రవేశపెడుతూ థార్ ఎర్త్ ఎడిషన్ అనే కొత్త మోడల్ ని లాంచ్ చేసింది. కంపెనీ ప్రకారం, ఈ స్పెషల్ ఎడిషన్ థార్ డెజర్ట్ ద్వారా ఇంస్పైర్ చేయబడింది. ఇది LX హార్డ్ టాప్ 4x4 టైప్ లో మొత్తం నాలుగు వేరియంట్లలో, రూ.15.40 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.
ఎక్స్‌టీరియర్ పరంగా బయటి వైపు, కొత్త థార్ ఎర్త్ ఎడిషన్ డెజర్ట్ ఫ్యూరీ సాటిన్ మ్యాట్ కలర్ తో, రియర్ ఫెండర్ మరియు డోర్లపై డూనే- ఇంస్పైర్డ్ డీకాల్స్, బి-పిల్లర్స్ పై ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జింగ్, మ్యాట్ బ్లాక్ బ్యాడ్జెస్, మరియు సిల్వర్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను పొందింది.
ఇంటీరియర్ పరంగా, లోపల 2024 థార్ ఎడిషన్ బ్లాక్ మరియు బీజ్ డ్యూయల్-టోన్ థీమ్, హెడ్‌రెస్ట్‌లపై డూన్ డిజైన్స్, డోర్‌లపై థార్ బ్రాండింగ్ మరియు చుట్టూ అంతా డార్క్ క్రోమ్ యాక్సెంట్స్ ని కలిగి ఉంది. ఇంకా, ఏసీవెంట్స్, సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ కోసం డెజర్ట్ ఫ్యూరీ-కలర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. బ్రాండ్ ప్రకారం, ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క ప్రతీ యూనిట్ యూనిక్ నంబర్ డెకరేటివ్ విఐఎన్ ప్లేట్ ని పొందింది.
ఇక కారులో కీలక భాగమైన ఇంజిన్ విషయానికి వస్తే, మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ఇంతకు ముందు ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లను ఇందులో కూడా కొనసాగిస్తుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో జత చేయబడ్డ్డాయి. అదనంగా, కస్టమర్లు దీనిని కస్టమైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్ రెస్ట్స్, ఫ్లోర్ మ్యాట్స్, మరియు కంఫర్ట్ కిట్ ని యాక్సెసరీల రూపంలో పొందవచ్చు.
వేరియంట్-వారీగా థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
వేరియంట్ | ధర |
థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎంటి | రూ. 15.40 లక్షలు |
థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎటి | రూ. 16.99 లక్షలు |
థార్ ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎంటి | రూ. 16.15 లక్షలు |
థార్ ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎటి | రూ. 17.60 లక్షలు |