- 4WD టైప్ లో లభ్యమవుతున్న కొత్త మోడల్
- రూ.15.40 లక్షలతో ధరలు ప్రారంభం
ఇండియన్ ఆటోమేకర్ అయిన మహీంద్రా నుంచి వచ్చిన థార్ ఒక స్ట్రాంగ్ ఆఫ్-రోడర్ కాగా, ఇప్పుడు ఇది ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ ని అందుకుంది, దాని పేరే “మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్”. లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ యొక్క కొత్త ఇటరేషన్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో రూ.15.40 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
ఎక్స్‌టీరియర్ మార్పులు
థార్ యొక్క ఎక్స్‌టీరియర్ లో అతి పెద్ద మార్పు ఏంటి అంటే, ఇప్పుడు ఇది డెజర్ట్ ఫ్యూరీ అనే కొత్త కలర్ తో సాటిన్ మ్యాట్ ఫినిష్ ని పొందింది. ఇంకా కనిపిస్తున్న ఇతర అంశాలలో డూనే/డెజర్ట్-ఇంస్పైర్డ్ డీకాల్స్ మరియు రియర్ ఫెండర్ మరియు డోర్లపై గ్రాఫిక్స్, సిల్వర్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్, మరియు బి-పిల్లర్స్ పై స్క్వేర్ షేప్డ్ 3-డైమెన్షనల్ “ఎర్త్ ఎడిషన్” బ్యాడ్జెస్ ఉన్నాయి.
కొత్త ఎక్స్‌టీరియర్ తో పాటుగా, థార్ 4WDని మొత్తం రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, నపోలి బ్లాక్, మరియు ఎవరెస్ట్ వైట్ అనే నాలుగు కలర్లలో పొందవచ్చు.
ఇంటీరియర్ మార్పులు
లోపల, థార్ ఎర్త్ ఎడిషన్ డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బీజ్ కలర్ ని పొందగా, మరియు హెడ్ రెస్ట్స్ పై డ్యూన్స్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఎస్‍యూవీ యొక్క క్యాబిన్లో ఏసీ వెంట్స్, సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్‌పై డెసర్ట్ ఫ్యూరీ-కలర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. ఇంకా, ఈ థార్ స్పెషల్ ఎడిషన్ యొక్క ప్రతీ యూనిట్ సీరియల్ నంబర్ “1” తో ప్రారంభమయ్యే యూనిక్ నంబర్ డెకరేటివ్ విఐఎన్ ప్లేట్ ని పొందనుంది.
యాక్సెసరీస్
థార్ స్పెషల్ ఎడిషన్కస్టమైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్ రెస్ట్స్, 7Dఫ్లోర్ మ్యాట్స్, మరియు కంఫర్ట్ కిట్ వంటి యాక్సెసరీల బెనిఫిట్ ని పొందనుంది.
పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లను తీసుకువచ్చింది. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో జత చేయబడ్డ్డాయి. అదే విధంగా, ఈ కొత్త ఎడిషన్ కేవలం ఆఫ్-రోడర్ యొక్క 4WD టైప్ లో మాత్రమే అందించబడింది.
ధరలు
వేరియంట్-వారీగా థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క ఎక్స్-షోరూం ధరలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
వేరియంట్స్ | ధరలు |
థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎంటి | రూ. 15.40 లక్షలు |
థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎటి | రూ. 16.99 లక్షలు |
థార్ ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎంటి | రూ. 16.15 లక్షలు |
థార్ ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎటి | రూ. 17.60 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్