- ఇండియాలో రూ. 11.25లక్షలతో ప్రారంభమైన థార్ ధరలు
- అందుబాటులో ఉన్న కన్వర్టిబుల్ మరియు హార్డ్‌టాప్ టైప్స్
జనవరి 2024 నుండి మహీంద్రా కార్ల మోడల్ వారీగా విక్రయాల సంఖ్యను మేము పొందాము. అలాగే, ఎక్స్‌యువి700, స్కార్పియో మరియు వివిధ మోడళ్ల విక్రయాల సంఖ్యను త్వరలో మన కార్‍వాలే సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి, ఈ కథనంలో థార్ వివరాలను మనం పరిశీలిద్దాం.
జనవరి 2024లో, మహీంద్రా మొత్తం 6,059 థార్ యూనిట్లను విక్రయించగా, ఇందులో డీజిల్ వేరియంట్‌లు మాత్రం 5,402 యూనిట్లతో 89 శాతం వరకు చేరుకున్నాయి. అదే సమయంలో, ఈ బ్రాండ్ టూ-డోర్ ఎస్‍యూవీ యొక్క 657 యూనిట్లను విక్రయించింది. అంతేకాకుండా, గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 334 యూనిట్లతో పోలిస్తే ఇది ఇప్పుడు దాదాపు 100 శాతం వరకు చేరుకుంది. మరోవైపు, ఈ కంపెనీ గత ఏడాది డీజిల్ వేరియంట్లో ఎస్‌యూవీ 4,076 యూనిట్లను విక్రయించింది.
ఉత్పత్తి విషయానికి వస్తే, మహీంద్రా 5,500 యూనిట్ల వరకు డీజిల్ థార్ కార్లను తయారు చేయగా, గత ఏడాది ఇదే కాలంలో 4,987 యూనిట్లను చేరుకుంది. అదే విధంగా, పెట్రోల్ వేరియంట్‌ల ఉత్పత్తి జనవరి 2023 నుండి జనవరి 2024 వరకు 346 యూనిట్ల నుండి 671 యూనిట్ల వరకు చేరుకుంది.
అలాగే, హార్డ్‌టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్, పెట్రోల్,డీజిల్ ఇంజిన్ మరియు మాన్యువల్ ,ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లు, ఎఎక్స్ ఆప్ట్, ఎల్ఎక్స్ వేరియంట్స్ తో సహా వివిధ అప్‌డేట్స్ తో మహీంద్రా థార్ అందుబాటులో ఉంది. ఈ కారు డ్రైవ్ మరియు రివ్యూ మన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మీరు ఈ రివ్యూను చూడవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప