- పనోరమిక్ సన్‌రూఫ్ ని పొందవచ్చని అంచనా
- గూర్ఖా ఫైవ్-డోర్‌కు పోటీగా వస్తున్న థార్ రాక్స్
మహీంద్రా కంపెనీ థార్ ఫైవ్-డోర్‌ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించగా, దానికి థార్ రాక్స్ అని పేరు కూడా పెట్టేసింది. ఈ లైఫ్‌స్టైల్ ఎస్‍యూవీ భారీ ఇటరేషన్ ఆగస్టు 15న ఇండియాలో లాంచ్ చేయబడుతుంది. అదే విధంగా లాంచ్ అయిన తర్వాత, కొత్త మహీంద్రా థార్ రాక్స్ ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ వెర్షన్ కి గట్టి పోటీ ఇవ్వనుంది.
డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త థార్ రాక్స్ సర్క్యులర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సర్క్యులర్ ఫాగ్ లైట్స్, కొత్త మల్టీ-స్లాట్ గ్రిల్ మరియు ఫెండర్-మౌంటెడ్ ఓఆర్‌విఎంస్ వంటి వాటిని పొందుతుంది. ఇంకా చెప్పాలంటే, ఇది డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ కెమెరా, సి-పిల్లర్‌పై అమర్చబడినబాడీ-కలర్డ్ రియర్ డోర్ హ్యాండిల్స్, స్క్వేర్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉండనున్నాయి.
మహీంద్రా కంపెనీ 2024 థార్ రాక్స్ ఇంటీరియర్‌కి సంబంధించిన వివరాలను వెల్లడించనప్పటికీ, ఇది పనోరమిక్ సన్‌రూఫ్ (మిడ్-స్పెక్ వేరియంట్లలో సింగిల్ పేన్ యూనిట్), పెద్ద టచ్‌స్క్రీన్ యూనిట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మరెన్నో ఫీచర్లతో రానుంది.
బానెట్ కింద, థార్ రాక్స్ ఆఫ్-రోడర్ లో అందించబడే 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి రానున్నాయి. ప్రధానంగా ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ మోడల్ తో మాత్రమే కాకుండా, థార్ రాక్స్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, ఎంజి ఆస్టర్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ వంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్