- ఈ మధ్య కాలంలో తగ్గిన థార్ వెయిటింగ్ పీరియడ్
- మరికొన్ని నెలల్లో లాంచ్ అవ్వనున్న 5-డోర్ ఇటరేషన్
మహీంద్రా కంపెనీ నుండి వచ్చిన ఎస్‍యూవీలకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో, చాలా కార్లపై లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉండడం ప్రారంభమైంది. ఇప్పటివరకు బ్రాండ్ మొత్తం 2.26 లక్షల యూనిట్ల ఓపెన్ బుకింగ్స్ ని సాధించగా, ఈ ఆర్టికల్ ద్వారా, థార్ రేంజ్ ఎన్ని యూనిట్ల బుకింగ్స్ సాధించిందో మనం తెలుసుకుందాం.
ఫిబ్రవరి-2024 నాటికి, మహీంద్రా థార్ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీకి సంబంధించి 71,000 యూనిట్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ నంబర్లలో ఆర్డబ్లూడీ వెర్షన్స్ కూడా కలిపి ఉండగా, ప్రతి నెలా సగటున 7,000 యూనిట్ల తాజా బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి.
ఫిబ్రవరి-2024కి సంబంధించిన దాని అప్‍డేట్స్ తో పాటుగా మహీంద్రా కంపెనీ మరికొన్ని అదనపు వివరాలను కూడా వెల్లడించింది. కంపెనీ ప్రతి నెలా 50,000 కొత్త బుకింగ్స్ అందుకుంటూ కొనసాగుతుండగా, అందులో 40,000 కార్లు బిల్లింగ్ వరకు వెళ్తున్నాయి. అదనంగా, 10 శాతం బుకింగ్స్ క్యాన్సిలేషన్ కి గురవుతున్నాయి. ఇక ఈ సంవత్సరం చివరలో 5-డోర్ వెర్షన్ అందుబాటులోకి వచ్చాక థార్ బ్రాండ్ కి సంబంధించిన బుకింగ్స్ నంబర్స్ మరింతగా పెరగవచ్చని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్