- ఈ సంవత్సరం చివరలో థార్ ఫైవ్-డోర్ మోడల్ ని పరిచయం చేయనున్న మహీంద్రా
- ఇప్పటి వరకు మొత్తం 2.2 లక్షల బుకింగ్స్ సాధించిన మహీంద్రా
మహీంద్రా విక్రయిస్తున్న దాని ప్రొడక్టులపై విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో, దాని కోసం, దానికి అనుగుణంగా భవిష్యత్తులో ప్రొడక్షన్ ని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ కార్ మేకర్ తాజాగా XUV700 ప్రొడక్షన్ ని పెంచడంతో, దాని ఫలితంగా ఈ కార్ల ఓపెన్ బుకింగ్స్ సంఖ్య దారుణంగా పడిపోయింది.
ఇక థార్ విషయానికి వస్తే, ఈ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ మే-2024 నాటికి 59,000 యూనిట్ల ఓపెన్ బుకింగ్స్ ని సాధించింది. ఇదే సమయంలో బ్రాండ్ 2.2 లక్షల పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉండగా, అయినా కూడా ఈ మోడల్ ప్రతినెలా దాదాపుగా 7,000 ఫ్రెష్ బుకింగ్స్ అందుకుంటుంది.
మరికొన్ని నెలల్లో ఆటోమేకర్ ఈ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ ఫైవ్-డోర్ వెర్షన్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా, లాంచ్ అయిన తర్వాత మహీంద్రా నుంచి వచ్చిన థార్ ఓపెన్ బుకింగ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మోడల్ దాని త్రీ-డోర్ మోడల్ కంటే భారీ సక్సెస్ ని పొందనుంది, అలాగే ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, మరియు ఫోక్స్ వ్యాగన్ టైగున్ వంటి కార్లతో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్