- డిస్కౌంట్లతో అమ్మకానికి ఉన్న చాలా వేరియంట్లు
- రూ. 11.35 లక్షలతోధరలు ప్రారంభం
మహీంద్రా థార్ రాక్స్ ఆగస్ట్ నెల మధ్యలో లాంచ్ అయినప్పటి నుండి 5-డోర్ (లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్) పై మరింత క్రేజ్ పెరిగింది. కొత్త థార్ రాక్స్ ఇంకా షోరూమ్ లో అడుగు పెట్టకముందే ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. లాంచ్ తర్వాత మహీంద్రా మొదటిసారి త్రీ-డోర్ థార్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
మహీంద్రా థార్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు, మహీంద్రా థార్ లోని చాలా వేరియంట్లపై రూ.1.35 లక్షల వరకు మరియు రూ.1.75 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే, వెర్షన్, ప్రాంతాన్ని బట్టి మరియు స్టాక్ లభ్యత వంటి ఇతర వివిధ కారణాలపై ఆధారపడి ఈఆఫర్ అమౌంట్ మారవచ్చు. కాబట్టి, మీకు కావాల్సిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి మీ సమీపంలోని మహీంద్రా- అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము.
ప్రస్తుతం, మహీంద్రా థార్ రూ. 11.35 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, థార్ టాప్-స్పెక్ వెర్షన్ రూ.17.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. అలాగే, వేరియంట్లు మరియు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ విషయానికొస్తే, త్రీ-డోర్ థార్ AX (O), LX మరియు ఎర్త్ ఎడిషన్ వేరియంట్లలో ఒక పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప