- నపోలి బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ నిలిపివేత
- కొత్త పెయింట్ స్కీమ్ గా మారిన స్టెల్త్ బ్లాక్
మహీంద్రా తన రెండు పాపులర్ ఎస్‌యువిలు, థార్ మరియు స్కార్పియో క్లాసిక్ యొక్క ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను అప్‌డేట్ చేసింది. ఈ రెండు ఎస్‌యువిలు ఇప్పుడు బ్రాండ్ యొక్క సిగ్నేచర్ నపోలి బ్లాక్ ఎక్ట్సీరియర్ కలర్ స్థానంలో కొత్త బ్లాక్ కలర్‌ను పొందాయి. ప్రస్తుతం, థార్ మరియు స్కార్పియో క్లాసిక్ వరుసగా 5 మరియు 4 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి.
రెండు ఎస్‌యువి ఇప్పుడు వాటి లైనప్‌లోని కొత్త స్టెల్త్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ ను పొందగా, స్కార్పియో N, XUV700, XUV300 మరియు బొలెరో నియోతో సహా ఇండియన్ ఆటోమేకర్ నుండి వచ్చిన ఇతర ఎస్‌యువిలు చాలా వరకు నపోలి బ్లాక్ పెయింట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఆటోమేకర్ నపోలి బ్లాక్ పేరును స్టెల్త్ బ్లాక్‌గా మార్చిందని సందేహం మాకు ఉంది, ఎందుకంటే దీనిలో ఎటువంటి తేడాలు కనిపించలేదు.
ఇతర వార్తలలో చూస్తే, ఇండియన్ యూవీ మేకర్ XUV300పై ఆర్డర్‌లను అంగీకరించడం ఆపివేసింది, ఎందుకంటే ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో రాబోతుందని భావిస్తున్నాం. అంతేకాకుండా, ఇటీవల టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ లో అనేక కీలక వివరాలను మహీంద్రా వెల్లడించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప