- ఆగస్టు 15వ తేదీన ఇండియాలో వెల్లడికానున్న థార్ 5-డోర్ ధరలు
- సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో వస్తున్నట్లు ఇది వరకే నిర్ధారించిన కంపెనీ
కొత్త మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ లాంచ్ కి సమయం దగ్గర పడుతుండగా, కొత్త స్పై షాట్స్ ద్వారా ఈ ఎస్‍యూవీకి సంబంధించి తాజా వివరాలు వెల్లడయ్యాయి. ఈసారి, థార్ 5-డోర్ టెస్ట్ మ్యూల్ మహీంద్రా నుంచి వచ్చిన ఇతర టెస్టింగ్ కార్లతో పాటుగా ఒక డీలర్ యార్డు దగ్గర కనిపించింది.
లేటెస్ట్ స్పై షాట్లను చూస్తే, 2024 మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ లాంచ్ సమయానికి డ్యూయల్-పేన్ సన్ రూఫ్ తో వస్తున్నట్లు ఇక్కడ అందించిన చిన్న క్లూ ద్వారా మనకు అర్థం అవుతుంది. అదే విధంగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉన్న కారు రూఫ్ పై కట్ అవుట్స్ ని బట్టి ఇది కొత్త ఫీచర్ తో రానుంది అని మనకు తెలుస్తుంది. కాకపోతే ఇది థార్ టాప్ –స్పెక్ వెర్షన్ కి మాత్రమే పరిమితం చేయబడవచ్చు. ఇంతకు ముందు ఈ మోడల్ సింగిల్-పేన్ సన్ రూఫ్ తో కనిపించగా, ఇది మిడ్-స్పెక్ వేరియంట్లలో కూడా అందించే అవకాశం ఉంది.
అంతే కాకుండా, థార్ 5-డోర్ వెర్షన్ కొత్త గ్రిల్, ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్, పెద్ద టచ్ స్క్రీన్ యూనిట్, రియర్ ఏసీ వెంట్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మరెన్నో ఫీచర్లను పొందనుంది.
ప్రస్తుతం రాబోయే (అప్ కమింగ్) మహీంద్రా థార్ 5-డోర్ మోడల్ కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలు అధికారికంగా వెల్లడించపోయినా, థార్ 3-డోర్ వెర్షన్ లాగా ఒకే రకమైన పవర్ ట్రెయిన్స్ తో వచ్చే అవకాశం ఉంది. అందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులు 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్లతో జతచేయబడి ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్