- ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో రానున్న థార్ ఫైవ్-డోర్
- హార్డ్-టాప్ బాడీ స్టైల్ లో మాత్రమే అందించబడే అవకాశం
కొన్ని నెలల క్రితం నుంచి మహీంద్రా థార్ ఫైవ్-డోర్ కి సంబంధించిన ఫ్రెష్ స్పై షాట్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ హీట్ ని మరింత పెంచడానికి మేము దీనికి సంబంధించిన మరిన్ని స్పై షాట్లను మీకు అందిస్తున్నాము. ఈ సమయంలో, లేటెస్ట్ స్పై షాట్స్ కారుకు సంబంధించిన అత్యంత కీలక వివరాలను వెల్లడించాయి. 3-డోర్ థార్ తో పోలిస్తే ఇందులోని రెండవ వరుస కొంచెం వేరుగా కనిపిస్తుంది.
స్పై షాట్స్ ప్రకారం, కొత్త థార్ ఫైవ్-డోర్ కారు వెనుక భాగంలో విశాలమైన స్పేస్ ని మీకు అందిస్తుంది. ప్రస్తుత విక్రయించబడుతున్న ఇటరేషన్లో ఉన్నట్లే సీట్ అప్హోల్స్టరీ డిజైన్ ఒకే విధంగా కనిపిస్తున్నా, ఇది రెండవ వరుసలో కూర్చునే ప్యాసింజర్లకు సౌకర్యంగా ఉండేందుకు ఏసీ వెంట్స్ సెట్ తో రానుంది. డోర్స్ క్వార్టర్ గ్లాస్ ప్యానెల్స్ ఫీచర్ ని కలిగి ఉంటుండగా, వాటర్ బాటిల్స్ ఉంచేందుకు స్టోరేజీని కూడా కలిగి ఉంది. అలాగే, ఇందులో దానికి ప్రక్కనే పట్టుకునేందుకు హ్యాండిల్ కూడా అందించబడనుంది. ముఖ్యంగా, ఎ-పిల్లర్ మరియు బి-పిల్లర్ వైపు అదనంగా పట్టుకునేందుకు హ్యండిల్స్ కూడా అందించనుంది.
2024 మహీంద్రా థార్ ఫైవ్-డోర్ లో గుర్తించాల్సిన ముఖ్యమైన హైలైట్స్ ఏవి అంటే, ఇందులో XUV 3XO లో అందించబడిన కొత్త 10.25-ఇంచ్ స్క్రీన్, లెదర్ తో చుట్టబడిన యూనిట్ పై స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సెంటర్ కన్సోల్ పై మల్టిపుల్ టాగుల్ స్విచ్, ఫ్రంట్ సీట్లపై థార్ బ్రాండింగ్, మరియు యుఎస్‍బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించబడే అవకాశం ఉంది.
ఎక్స్‌టీరియర్ పరంగా, 3-డోర్ వెర్షన్ లాగే థార్ 5-డోర్ మోడల్ కూడా అన్ని అంశాలను పొందనుంది. మరింత మెరుగైన రివైజ్డ్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ లైట్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్, మరియు రియర్ వైపర్ మరియు వాషర్ వంటి వాటిని పొందనుంది.
మహీంద్రా థార్ దాని 5-డోర్ అవతార్ లో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-పెట్రోల్ డీజిల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. ఇది 15 ఆగస్టు 2024న అరంగేట్రం చేయబోతుండగా, దాని కంటే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు అందిస్తాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్