- ఇండియాలో రూ. 14.03 లక్షలు నుండి ప్రారంభంకానున్న ఎక్స్‌యువి700 ధరలు
- పెట్రోల్ వేరియంట్స్ తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా అమ్ముడుపోయిన డీజిల్ వేరియంట్స్
ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కంపెనీ తన సెప్టెంబర్-2023 సేల్స్ డేటాను ప్రకటించింది. ఈ కార్ మేకర్ నుంచి రిలీజైన వివిధ మోడల్స్ విపరీతమైన డిమాండ్ పెరుగుతూనే ఉంది, అలాగే కొన్ని సెలెక్టెడ్ కార్లపై వెయింటింగ్ పీరియడ్ కూడా అలాగే ఉంది.
ప్రస్తుతం, మహీంద్రా బ్రాండ్ నుంచి వచ్చిన ఎక్స్‌యువి700 విషయానికి వస్తే, కేవలం సెప్టెంబర్-2023లోనే 8,555 యూనిట్లను విక్రయించింది, అందులో ఒక్క డీజిల్ వేరియంట్ కి సంబంధించి 6,350 యూనిట్లను విక్రయించగా, పెట్రోల్ వేరియంట్ సేల్స్ 2,205 యూనిట్లుగా ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే, మహీంద్రా కంపెనీ 6,717 డీజిల్ రేంజ్ యూనిట్లను మరియు 2,686పెట్రోల్ రేంజ్ యూనిట్లను ఉత్పత్తి చేసింది.
గత నెలలో, మహీంద్రా కంపెనీ మూడు వరుసల ఎస్‍యువి ఎక్స్‌యువి700 ధరలను రూ.38,880 వరకు పెంచింది. దాని ఫలితంగా, మోడల్ ప్రారంభ ధర రూ.14.03 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది. ఇదే సంవత్సరం ఆగస్టులో మహీంద్రా 1.10 లక్షలకు పైగా ఎస్‍యువిలను రీకాల్ చేయగా, అందులో ఎక్స్‌యువి400 మరియు ఎక్స్‌యువి700 కూడా ఉన్నాయి. తర్వాత పరిశీలించగా, ఇందులో ఒక్క ఎక్స్‌యువి700 వెహికిల్స్ మాత్రమే 1.08 లక్షలుగా ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్