- త్వరలో 5-డోర్ రూపంలో రానున్న మహీంద్రా థార్
- డీజిల్ కంటే 10 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోయిన పెట్రోల్ వెర్షన్లు
మహీంద్రా కంపెనీ మే-2024కి సంబంధించి దాని సేల్స్ నంబర్లను ప్రకటించింది. కార్ మేకర్ ప్రస్తుతం ఇండియాలో XUV 3XO, XUV400, థార్, స్కార్పియో, స్కార్పియో N, బొలెరో, మరియు XUV700 అనే మోడళ్లను విక్రయిస్తుంది. ఈ ఆర్టికల్ ద్వారా, థార్ మోడల్ కి సంబంధించి ఎన్ని కార్లను విక్రయించిందో తెలుసుకుందాం.
చివరి నెల నాటికి, మహీంద్రా కంపెనీ 5,750 యూనిట్ల థార్ కార్లను విక్రయించగా, అందులో అత్యధిక మొత్తంలో 5,207 యూనిట్ల డీజిల్ వెర్షన్ కార్లు ఉన్నాయి. ఇక పెట్రోల్ వెర్షన్ కార్ల విషయానికి వస్తే, మహీంద్రా 543 యూనిట్ల పెట్రోల్ వెర్షన్ థార్ కార్లను విక్రయించింది. గత సంవత్సరం, ఇదే కాలానికి సంబంధించి మహీంద్రా కంపెనీ వరుసగా 3,190 మరియు 1,106 యూనిట్ల పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ థార్ కార్లను విక్రయించింది.
అదే విధంగా, మహీంద్రా 5,224 యూనిట్ల థార్ కార్లను ఉత్పత్తి చేయగా, అందులో 482 యూనిట్ల పెట్రోల్ వెర్షన్ థార్ కార్లు ఉన్నాయి. అలాగే, ప్రొడక్షన్ నంబర్ల విషయానికి వస్తే,2,512 యూనిట్ల పెట్రోల్ వెర్షన్ థార్ కార్లు ఉండగా,1,061 యూనిట్ల డీజిల్ వెర్షన్ థార్ కార్లు ఉన్నాయి. మహీంద్రా కంపెనీ ఆగస్టు 15వ తేదీన థార్ 5-డోర్ వెర్షన్ ని పరిచయం చేయనుండడంతో, మరికొన్ని నెలల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్