- రికార్డు స్థాయిలో 32% శాతంగా నమోదైన డొమెస్టిక్ కార్ సేల్స్ వార్షిక వృద్ధిరేటు
- 42 శాతం మేర క్షీణించిన ఎగుమతులు
మహీంద్రా నవంబరు-2023కి సంబంధించి తమ ఓవరాల్ ఆటో సేల్స్ వివరాలను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం 70,576 యూనిట్స్ విక్రయించింది. ఇందులో 39,981యూనిట్స్ డొమెస్టిక్ సేల్స్, 1,816యూనిట్స్ ఎగుమతులు, మరియు 28,779 కమర్షియల్ వెహికిల్ సేల్స్ ఉన్నాయి.
ఇతర వార్తలలో చూస్తే, ప్రస్తుతం నవంబరు-2023 నాటికి ఓఈఎం ద్వారా 2.85 లక్షలకు పైగా ఓపెన్ బుకింగ్స్ సాధించగా, అందులో 1.19 లక్షల బుకింగ్స్ తో స్కార్పియో అగ్రస్థానంలో నిలవగా, దాని తర్వాత 76,000 ఓపెన్ బుకింగ్స్ తో థార్ నిలిచింది. దీనికి అదనంగా, ఈ ఆటోమేకర్ ప్రతి నెలా 51,000 ఓపెన్ బుకింగ్స్ అందుకుంటూ ఇండియన్ మార్కెట్లో విజయవంతంగా దూసుకెళుతుంది.
విక్రయాలపైమహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, “మా ఎస్‍యూవీల పోర్ట్‌ఫోలియోకు స్ట్రాంగ్ డిమాండ్ కారణంగా మేము మా వృద్ధిని నిరంతరంగా కొనసాగిస్తున్నాము. నవంబర్‌లో, మేము 32 శాతం వృద్ధితో మొత్తం 39,981 యూనిట్లను విక్రయించాము. ప్రస్తుత పండుగ సీజన్‌ను గమనిస్తే, నెలలో కొన్ని విడి భాగాల సరఫరా గురించి సవాళ్లను ఎదుర్కొన్నాము. అయినా సరే, వాటిని మేము నిశితంగా పరిశీలించడమే కాకుండా సవాళ్లను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము” అని పేర్కొన్నారు.