- 24శాతంవార్షికవృద్ధిని నమోదు చేసిన మహీంద్రా
- వచ్చే నెలల్లో వివిధ మోడళ్లను పరిచయం చేసే అవకాశం
మహీంద్రా డిసెంబర్ 2023లో తాను విక్రయించిన వాహనాల సంఖ్యను ప్రకటించింది. డిసెంబర్ 2023లో కంపెనీ ప్యాసింజర్ వెహికల్ విక్రయాలు 35,171 వెహికల్స్ కు చేరుకోగా, వీటిని2022లో విక్రయించిన 28,445 యూనిట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధిని పొందింది.
నూతన సంవత్సర రాకతో, మహీంద్రా అనేక కొత్త మోడళ్లను ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అప్‌డేటెడ్ ఎక్స్‌యువి400 ఈవీ మరియు ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ ల రాకతో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని మహీంద్రా భావిస్తుంది, తర్వాత బొలెరో నియో ప్లస్ కూడా రానుంది. సంవత్సరంలో ఎప్పుడైనా, కార్‌మేకర్ థార్ యొక్క 5-డోర్ వెర్షన్‌ను పరిచయం చేయనుంది, తర్వాత ఎక్స్‌యువి.e8 రానుంది, కానీ, తప్పనిసరిగా ఎక్స్‌యువి700 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రానుంది. రెండోది కూడా ఈ ఏడాది లో ఎప్పుడైనా కెప్టెన్ సీటు ఫార్మాట్‌లో వచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ఎం&ఎం ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. 'డిసెంబర్‌లో ఎస్‌యువిలపై మొత్తం 35,171 యూనిట్లను అమ్మకాలను జరుపగా, గత ఏడాదితో పోలిస్తే 24 శాతం వృద్ధిని పొందామని తెలిపారు. మేము కొన్ని సెలెక్టెడ్ కొరతతో సరఫరా పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం జరిగింది, ముందుకు కొనసాగుతూ ఈ సవాళ్లను ఎదుర్కొని సరఫరా కొరతను తగ్గించడానికి మేము మా సరఫరాదారులతో కలిసి పని చేస్తున్నాము' అని తెలిపారు.
అనువాదించిన వారు: రాజపుష్ప