- మొత్తానికి మరో మైలురాయిని చేరుకున్న స్కార్పియో రేంజ్
- భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న స్కార్పియో- ఎన్
- సరికొత్త మైలురాయిని చేరుకున్న మహీంద్రా స్కార్పియో
వాస్తవానికి మహీంద్రా అండ్ మహీంద్రా 2002లోనే స్కార్పియో ఎస్యూవీని పరిచయం చేసింది. సుమారు 11 సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం దేశంలో 9 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైల్ రాయిని అధిగమించినందుకు ఇప్పుడు కారు తయారీదారులు సంబరాలు జరుపుకుంటున్నారు.
భారతదేశంలో మహీంద్రా స్కార్పియో శ్రేణి మరియు ధరలు.
భారతదేశంలో, మహీంద్రా ప్రస్తుతం స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో ఎన్ అని పిలువబడే రెండు మోడల్స్ ను స్కార్పియో నేమ్ ప్లేట్ క్రింద విక్రయిస్తోంది. పాత జెన్ ఎస్యూవీ యొక్క నవీకరించబడిన వెర్షన్, వీటి ధర రూ.13 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు, స్కార్పియో ఎన్ అనేది గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభించబడిన సరికొత్త మోడల్. ప్రస్తుతం దీని ధర రూ.13.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇటీవల, భారతదేశంలో స్కార్పియో ఎన్ బ్రాండ్ మొదటి వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించింది.
మహీంద్రా స్కార్పియో తాజా అప్‍డేట్స్
ఈ వారం ప్రారంభంలో, మహీంద్రా స్కార్పియో ఎన్ కోసం వెయిటింగ్ పీరియడ్ 65 వారాల నుంచి 55 వారాలకు తగ్గింది. మే 2023 నాటికి, భారతీయ ఆటోమొబైల్ బ్రాండ్ స్కార్పియో శ్రేణి 1.17 లక్షల ఓపెన్ బుకింగ్స్ రాబట్టగలిగింది, ఇందులో స్కార్పియో ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప