- రేంజ్ లో ఉన్న స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N
- ఇటీవల లాంచ్ అయిన XUV 3XO పై కూడా 50,000 బుకింగ్‌లను సాధించిన మహీంద్రా
మే 2024 నాటికి మహీంద్రా భారీ పెండింగ్ ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. అలాగే, ఆటోమేకర్ దేశవ్యాప్తంగా ఇంకా సుమారు 2.2 లక్షల యూనిట్లను డెలివరీ చేయవలసి ఉంది. ఇప్పుడు, స్కార్పియో రేంజ్ సంఖ్యలను మనం పరిశీలిద్దాం.
మహీంద్రా స్కార్పియో రేంజ్ లో ఉన్న స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N మోడల్స్ మొత్తం 86,000 ఓపెన్ బుకింగ్‌లను కలిగి ఉన్నాయి. కంపెనీ ప్రతి నెలా సగటున 17,000 తాజా బుకింగ్‌లను పెంచుతూనే ఉన్నప్పటికీ, ఈ నెలలో ఈ మోడల్ పై లేదా రేంజ్ కి ఇది అత్యధిక బుకింగ్ నంబర్ అని చెప్పవచ్చు.
థార్ రేంజ్ అత్యధిక బుకింగ్ నెంబర్లతో 59,000 యూనిట్లతో తదుపరి స్థానంలో ఉండగా, XUV 3XO మోడల్ 50,000 యూనిట్లతో దాని తర్వాతి స్థానంలో ఉంది. XUV 3XO గత నెల చివర్లో లాంచ్ కాగా, ఈ మోడల్ రూ. 7.49 లక్షలు ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమైన తర్వాత, ఒక్క రోజులోనే ఈ మోడల్ 50,000 బుకింగ్స్ తో సరికొత్త మైలురాయిని సాధించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప