- స్కార్పియో రేంజ్ లో క్లాసిక్ మరియు N వెర్షన్లనువిక్రయిస్తున్న మహీంద్రా
- రెండు నెలల్లో 33 శాతం వరకు తగ్గిన ఓపెన్ బుకింగ్స్
ఇండియాలో ఈ మధ్య కాలంలో మహీంద్రా వివిధ కార్ల ఉత్పత్తిని భారీగా పెంచింది, దీంతో సరఫరాను మెరుగుపరచాలని నిశ్చయించి తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సరఫరాను ఉధృతం చేస్తుంది. దీని కారణంగా కార్‌మేకర్ ఓపెన్ బుకింగ్‌లలో గణనీయమైన తగ్గుదలని కలిగి ఉంది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
జూలై 2024 నాటికి, స్కార్పియో రేంజ్ లో 58,000 యూనిట్ల ఓపెన్ ఆర్డర్ బుకింగ్‌ను పొందగా, మే నెలలో ఉన్న 86,000 యూనిట్ల ఆర్డర్‌లతో పోలిస్తే ఇది దాదాపు 33 శాతం వరకు తగ్గింది. ముఖ్యంగా చెప్పాలంటే, మహీంద్రా కంపెనీ దాని మోడల్ రేంజ్ లో ఇంకా 1.78 లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయాల్సి ఉంది.
అదే విధంగా, ప్రతి నెలా స్కార్పియో N మరియు స్కార్పియో క్లాసిక్ మోడల్స్ 12వేల వరకు కొత్త బుకింగ్‌లను నమోదు చేస్తూనే ఉన్నాయి. అలాగే, స్కార్పియో రేంజ్ మాత్రమే కాకుండా, థార్ కూడా గత కొన్ని నెలల్లో పొందిన ఓపెన్ ఆర్డర్‌లలో సుమారు 29 శాతం తగ్గుదలను పొందింది. వీటి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప