మహీంద్రా ఇటీవలే దాని పాపులర్ మోడల్ స్కార్పియో ఎన్ యొక్క కొత్త Z8 సెలెక్ట్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ మూడు-వరుసల ఎస్‍యూవీ యొక్క Z8 వేరియంట్ ను దిగువ స్థాయిలో ఉంచగా, ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు వెర్షన్లలో రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కథనంలో, కొత్త స్కార్పియో ఎన్ వేరియంట్ యొక్క ఫీచర్లను మరియు దీనికి పోటీగా ఉన్న టాటా సఫారీ యొక్క సమానంగా ఉన్న వేరియంట్ (ప్యూర్ O)తో పోల్చి చూద్దాం.
ముఖ్యంగా, టాటా సఫారీ గత సంవత్సరం అక్టోబర్‌లో ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో ఫేస్‌లిఫ్ట్ను పొందింది. ప్రస్తుతం ఈ ఎస్‍యూవీని రూ. 16.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు. అలాగే, ఈ స్కార్పియో ఎన్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్నపటికీ, సఫారీ డీజిల్ మిల్ తో మాత్రమే అందుబాటులో ఉంది.
ఫీచర్స్ | మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ (రూ. 17.99 లక్షలు ) | టాటా సఫారీ ప్యూర్ (O) (రూ. 18.19లక్షలు) |
ఈఎస్‍సీ, హెచ్‍హెచ్‍సి, ఈబీడీ- తో కూడిన ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ | అవును (ఉన్నాయి) | అవును (ఉన్నాయి) |
టిపిఎంఎస్ | లేదు | ఉంది |
ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ | ఉంది | ఉంది |
అన్ని 4 డిస్క్ బ్రేక్స్ | అవును (ఉన్నాయి) | లేవు |
అల్లాయ్ వీల్స్ | లేవు | అవును (ఉన్నాయి) |
క్లైమేట్ కంట్రోల్ | మాన్యువల్ | ఆటోమేటిక్ |
మూడవ వరుసలోఏసీ వెంట్స్ | లేవు | అవును (ఉన్నాయి) |
క్రూయిజ్ కంట్రోల్ | ఉంది | లేదు |
స్టీరింగ్అడ్జస్ట్ మెంట్ | టిల్ట్ | టిల్ట్ మరియుటెలిస్కోపిక్ |
డ్రైవర్స్ సీట్ అడ్జస్ట్ మెంట్ | 8-మార్గాలు (మాన్యువల్) | 6-మార్గాలు (మాన్యువల్) |
రియర్ ఆర్మ్‌రెస్ట్ | ఉంది | లేదు |
వన్ టచ్-అప్/డౌన్ విండోస్ | అవును (ఉన్నాయి) | లేవు |
ఒఆర్విఎంఎస్ | ఎలెక్ట్రికలీ అడ్జస్టబుల్ మరియు రెట్రాక్టల్ | ఎలెక్ట్రికలీ అడ్జస్టబుల్ మరియు రెట్రాక్టల్ |
రియర్ డీఫాగర్ | ఉంది | లేదు |
రియర్ వైపర్ | ఉంది | ఉంది |
రెయిన్-సెన్సింగ్ వైపర్స్ | అవును (ఉన్నాయి) | లేవు |
సన్‌రూఫ్ | ఉంది | లేదు |
ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ | అవును (ఉన్నాయి) | అవును (ఉన్నాయి) |
డిఆర్ఎల్స్ | ఉంది | ఉంది |
ఫాగ్ లైట్స్ | ఎల్ఈడీ | హాలోజన్ |
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ | 8-ఇంచ్ | 10-ఇంచ్ |
స్పీకర్స్ | 4 | 6 |
ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే | వైర్లెస్ | వైర్లెస్ |
మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క స్పెసిఫికేషన్స్
హుడ్ కింద, స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్‌లో 200bhp/380Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 172bhp/400Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
టాటా సఫారీ యొక్క స్పెసిఫికేషన్స్
మరోవైపు, సఫారీ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడిన 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.ఈ మోటార్ 170bhp మరియు 350Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప