- జూన్ 2022లో లాంచ్ అయిన స్కార్పియో ఎన్
- ఇండియాలో రూ.13.60 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమైన ధరలు
టాప్ సెల్లింగ్ ఎస్‍యూవీ, మోస్ట్ పాపులర్ మోడల్ స్కార్పియో ఎన్ ఒక లక్ష యూనిట్ల ప్రొడక్షన్ మైల్‍స్టోన్ ని అధిగమించినట్లు మహీంద్రా కంపెనీ పేర్కొంది. పాపులర్ ఎస్‍యూవీ జూన్ 2022 నుండి దేశవ్యాప్తంగా తన సేల్స్ కొనసాగిస్తుండగా, పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం, టాటా హారియర్ తో పోటీపడుతున్న ఈ మోడల్ ని మహీంద్రా Z2, Z4, Z6, Z8, మరియుZ8L అనే 5 వేరియంట్లలో, 7 కలర్స్ లో అందిస్తుంది. 3-వరుసల ఎస్‍యూవీ ధరలు రూ.13.60 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమై రూ. 24.54 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి.
మెకానికల్ గా, స్కార్పియో ఎన్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 198bhp మరియు 380Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 173bhp మరియు 400Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు ఆప్షనల్ 4ఎక్స్‌ప్లోర్ సిస్టమ్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
ఇతర వార్తలలో చూస్తే, తాజాగా మహీంద్రా కంపెనీ స్కార్పియో ఎన్ మోడల్ పై రూ. 39,300 వరకు ధరలను పెంచింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా కార్‌వాలే వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్