- రూ.13.60 లక్షలు ప్రారంభ ధరతో ఇప్పుడు స్కార్పియో N లభ్యం
- అందుబాటులో ఉన్న 5 కలర్స్ మరియు 5 వేరియంట్స్
డిసెంబర్ 2023లో, మహీంద్రా తన కార్లపై పెరగనున్న ధరలు జనవరి 2024 నుండి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అప్డేటెడ్ ధరలను మేము పొందాము. ఈ కథనంలో, స్కార్పియో N పై పెరుగుదలధరల పరిమాణాన్నిగురించి మేము మీకు తెలియజేస్తాము.
మహీంద్రా స్కార్పియో N ధరలు రూ.39,300 వరకు పెరిగాయి. ఈ ధర Z8L పెట్రోల్ ఎంటి 6S మరియు Z8L డీజిల్ ఎంటి 2డబ్ల్యూడి 6Sలకు మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు, Z8L డీజిల్ ఏటీ 4డబ్ల్యూడి 7S, Z8 డీజిల్ ఏటీ 4డబ్ల్యూడి 7S, Z8L డీజిల్ ఎంటి 4డబ్ల్యూడి 7S, Z8 డీజిల్ ఎంటి 4డబ్ల్యూడి 7S, Z4 డీజిల్ ఎంటి 4డబ్ల్యూడి 7S, మరియు Z4 డీజిల్ ఎంటి 4డబ్ల్యూడి 7S(ఈఎస్పీ)వంటి సెలెక్టెడ్ వేరియంట్లపై కేవలం రూ.600 మాత్రమే పెరిగింది.
స్కార్పియో N ఎస్యువి ధరలు ఇప్పుడు రూ. 13.60 లక్షలు వరకు ఉండగా, ఎంట్రీ-లెవల్ Z2 పెట్రోల్ ఎంటి 7S వేరియంట్ నుండి టాప్-స్పెక్ Z8L డీజిల్ ఏటీ 4డబ్ల్యూడి 7S ధర రూ.24.54 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉంది.ఈ మోడల్ లో మొత్తం 5 వేరియంట్స్ మరియు 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో కస్టమర్లు ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప