- 2025 నాటికి మార్కెట్ లో లాంచ్ కానున్న స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ డిజైన్
- కేవలం డీజిల్ పవర్‌ట్రెయిన్ తో రానున్న స్కార్పియో ఎన్
ఆగస్ట్ 2023లో, మహీంద్రా స్కార్పియో- ఎన్- బేస్డ్ పికప్ ట్రక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 'గ్లోబల్ పిక్ అప్'గా పిలువబడే ఈ ఆటోమేకర్ ఇప్పుడు ఇండియాలో మోడల్‌కు సంబంధించి అధికారిక హక్కులను పొందింది.
2025లో లాంచ్ కానున్నందున, పేటెంట్ ఇమేజ్‌లు ఇంతకు ముందు ప్రదర్శించబడిన మోడల్ లాగే కనిపిస్తాయి. స్క్వేర్డ్ హెడ్‌ల్యాంప్‌లు, హై సెట్ బానెట్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లతో ఉన్న స్కార్పియో-ఎన్‌ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. అయినప్పటికీ, రూఫ్ రాక్, ఫ్రంట్-మౌంటెడ్ స్నార్కెల్, భారీ స్కిడ్ ప్లేట్లు, ఇండివిడ్యువల్ సైడ్ స్టెప్‌లు మరియు లోడింగ్ బెగ్ వంటి కొన్ని అంశాలు దాని స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే కొంచెం వేరుగా ఉండనున్నాయి.
కొలతల పరంగా చూస్తే, పిక్ అప్ మొత్తంగా 5,380mm పొడవు మరియు 3,110mm వీల్ బేస్‌తో ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే పెద్దదిగా ఉంటుంది.
మహీంద్రా పికప్ లో ఉన్న ఇంటీరియర్ మరియు ఫీచర్ల గురించి చెప్పాలంటే, మొత్తం లేఅవుట్ మరియు డిజైన్ దాని ఎస్‌యువి అప్‌డేటెడ్ నుండి కొంచెం ముందు అప్‌డేటెడ్ కు తీసుకువెళతాయని మేము ఆశిస్తున్నాము. ఇది పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఒకే విధమైన ఎయిర్‌కాన్ ప్యానెల్ మరియు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లను పొందవచ్చు. అయితే, ఈ పికప్ గ్లోబల్ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసినందుకు , ఇది లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్‌లతో రానుంది.
మహీంద్రా పిక్ అప్ కాన్సెప్ట్ ఇంజిన్ వివరాలు
ఇది ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు ఇది లాంచ్ కాగా, ఇది మహీంద్రా పవర్డ్ సెకండ్-జెన్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఫోర్-వీల్ డ్రైవ్‌తో పాటు వివిధ డ్రైవ్ మోడ్‌లతో స్టాండర్డ్ గా ఉంటాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప