- 5 వేరియంట్స్ లో లభ్యం
- ఇండియాలో రూ.13.26 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభంకానున్న ధరలు
గత సంవత్సరం 2022 జూన్ లో మహీంద్రా స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. అప్పటి నుండి దీనికి డిమాండ్ ఇంకా పెరగడంతో ఇప్పటికీ కూడా ఈ మోడల్ పై చాలా ఎక్కువగా వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఎస్‍యూవీని Z2, Z4, Z6, Z8, మరియు Z8L అనే 5 వేరియంట్స్ లో పొందవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఇండియాలోని టాప్-10 నగరాల్లో మహీంద్రా స్కార్పియో ఎన్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ( నవంబర్ 18, 2023 ).
నగరాలు | బేస్ వేరియంట్ | టాప్ వేరియంట్ |
హైదరాబాద్ | రూ. 16.58 లక్షలు | రూ. 30.77 లక్షలు |
బెంగుళూరు | రూ. 16.81 లక్షలు | రూ. 31.06 లక్షలు |
ఢిల్లీ | రూ. 15.73 లక్షలు | రూ. 29.29 లక్షలు |
ముంబై | రూ. 15.95లక్షలు | రూ. 29.94లక్షలు |
పూణే | రూ. 15.84 లక్షలు | రూ. 29.76 లక్షలు |
లక్నో | రూ. 15.73 లక్షలు | రూ. 28.76 లక్షలు |
ఇండోర్ | రూ. 15.63 లక్షలు | రూ. 30.08 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 15.18 లక్షలు | రూ. 27.88 లక్షలు |
పాట్నా | రూ. 15.77 లక్షలు | రూ. 29.34 లక్షలు |
చెన్నై | రూ. 16.33 లక్షలు | రూ. 29.88 లక్షలు |
ఇందులోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి వచ్చింది. మొదటిది 198bhp మరియు 380Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 173bhp మరియు 400Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్స్ పరంగా, ఈ రెండు ఇంజిన్స్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇందులోని సెలెక్టెడ్ వేరియంట్స్ బ్రాండ్ 4ఎక్స్ ప్లోర్ సిస్టంతో వస్తాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్