- టాప్-స్పెక్ వేరియంట్‌ల నుంచి తీసుకోబడ్డ కొత్త ఫీచర్లు
- ఇప్పుడు అన్ని Z8 వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చిన మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్
మహీంద్రా దాని ఎస్‌యువి, స్కార్పియో N ఫీచర్స్ లో మార్పులు చేసింది. కొత్త అప్‌డేట్‌తో, ఈ మోడల్ ఇప్పుడు వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లను పొందింది. ముఖ్యంగా, ఆటోమేకర్ కొత్త ఫీచర్లను తీసుకువచ్చినా వేరియంట్స్ ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు.
సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ ఛార్జర్ మరియు హై గ్లోస్ ఫినిషింగ్‌ను Z8 సెలెక్ట్ మరియు Z8 వేరియంట్‌లు మాత్రమే పొందుతాయి, కేవలం Z8 L వేరియంట్ మాత్రమే - ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి రెండు అదనపు ఫీచర్లను పొందుతుంది. అదనంగా, ఇప్పుడు స్కార్పియోలోని అన్ని Z8 వేరియంట్‌లు మిడ్‌నైట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌ను పొందుతాయి.
Z8 S వేరియంట్ | Z8 వేరియంట్ | Z8L వేరియంట్ |
వైర్లెస్ చార్జర్ | వైర్లెస్ చార్జర్ | వైర్లెస్ చార్జర్ |
సెంటర్ కన్సోల్‌పై హై గ్లోస్ ఫినిషింగ్ | సెంటర్ కన్సోల్‌పై హై గ్లోస్ ఫినిషింగ్ | సెంటర్ కన్సోల్‌పై హై గ్లోస్ ఫినిషింగ్ |
- | - | ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం |
- | - | వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ |
ఆటోమేకర్ దాని ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి డ్యూయో, స్కార్పియో N మరియు XUV700వేరియంట్‌ల అప్‌డేట్ వివరాలను వెల్లడించింది. దీనికి ముందుగా ,ఈ బ్రాండ్ XUV700 ద్వారా రెండు లక్షల ఉత్పత్తి మైలురాయి సాధించిన సందర్భంగా రెండు కొత్త ఎక్స్‌టీరియర్ కలర్స్ ని తీసుకురాగా, అందులోబర్న్ట్ సియెన్నా మరియు డీప్ ఫారెస్ట్‌లను వంటి కలర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప