- ఇండియాలో ఇటీవలపెరిగిన స్కార్పియో ఎన్ ధరలు
- గత వారం లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన స్కార్పియో ఎన్
మహీంద్రా వెబ్‌లో షేర్ చేసిన డాక్యుమెంట్ లీకైన ప్రకారం, మహీంద్రా స్కార్పియో ఎన్ఎస్‌యువి యొక్క ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేసింది. ఈ మార్పులు, జనవరి 2024 నుండి బుకింగ్ చేసిన కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తాయి. ఇది ఐసిఎంఆర్ (ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ కాస్ట్ రిడక్షన్) పద్ధతిలో భాగం అని చెప్పవచ్చు.
డాక్యుమెంట్ ఆధారంగా, స్కార్పియో ఎన్ యొక్క Z4 మరియు Z6 వేరియంట్లలో కూల్డ్ గ్లోవ్ బాక్స్‌తో ఇకపై అందుబాటులో ఉండదు. అదే సమయంలో, Z6 వేరియంట్ ప్రస్తుతం ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మిస్ అవుతుండగా, Z4 వేరియంట్‌లో అందుబాటులో ఉన్న యూనిట్‌తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చబడింది. ఇంకా, Z4 వేరియంట్ అడ్రినో ఎక్స్ సూట్, బిల్ట్-ఇన్ అలెక్సా,కలర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను మిస్ అవ్వనుంది.
ఈ నెల ప్రారంభంలో, మహీంద్రా స్కార్పియో ఎన్ ధరలను రూ. 39,300 వరకు పెంచింది. ఈ ధరలపెరుగుదల పరిమాణం ఎంచుకున్న వేరియంట్, ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ని బట్టి మారుతూ ఉంటుంది. అదనంగా, ఇది గత సంవత్సరం జూన్‌లో లాంచ్ అయినప్పటికీ, దీని కార్‌మేకర్ ఇటీవలే ఎస్‌యువిలో లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప