- మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో అత్యధిక ఓపెన్ బుకింగ్స్ పొందిన స్కార్పియో
- ప్రతి నెలా పొందిన బుకింగ్స్ 17,000
ఇండియా నుంచి పాపులర్ ఎస్‍యువి తయారీదారులలో ఒకటైన మహీంద్రా, నవంబర్ 2023 నాటికి తమ కంపెనీ సాధించిన ఓపెన్ బుకింగ్స్ వివరాలను రిలీజ్ చేసింది. ఆటోమేకర్ మొత్తం 2.86 లక్షల ఓపెన్ బుకింగ్స్ పొందగా, వాటిలో స్కార్పియో బ్రాండ్ అత్యధికంగా బుకింగ్స్ సాధించి రికార్డ్ సృష్టించింది.
ప్రస్తుతం, స్కార్పియో ఎన్ బ్రాండ్ తమ పోర్ట్‌ఫోలియోలో 1.19 లక్షల ఓపెన్ బుకింగ్స్ పొందింది. ఇది Z2, Z4, Z6, Z8, మరియు Z8L అనే ఐదు వేరియంట్‌లలో లభిస్తుంది, ఈ పాపులర్ ఎస్‍యువి రేంజ్ ధరలు రూ. 13.26 లక్షల నుండి రూ. 24.53 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
ఇక ఫీచర్ల గురించి చెప్పాలంటే, స్కార్పియో ఎన్ లో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్, సోనీ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు అడ్రినోఎక్స్-కనెక్ట్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
హుడ్ కింద, స్కార్పియో ఎన్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో 2.0-లీటర్ గ్యాసోలిన్ ఇంజన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. మొదటిది 198bhp మరియు 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, రెండోది 173bhp మరియు 400Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉన్నాయి. ప్రత్యేకంగా ఇందులో మహీంద్రా 4ఎక్స్ ప్లోర్ సిస్టమ్ కూడా ఉంది.
స్కార్పియో ఎన్ కి పోటీగా టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి హెక్టర్ మరియు జీప్ కంపాస్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్