- బొలెరో.ఇ మరియు స్కార్పియో.ఇ లను పరిచయం చేసిన ప్రముఖ ఆటో బ్రాండ్ మహీంద్రా
- ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై ఎస్‍యువిలను తయారుచేయనున్న మహీంద్రా
థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ మోడళ్లను మరియు దాని కొత్త పికప్‌లను మహీంద్రా కంపెనీ దక్షిణాఫ్రికాలో ఆవిష్కరించింది. దేశంలో ఈ బ్రాండ్ నుండి థార్‌తో పాటు, స్కార్పియో మరియు బొలెరోలు ఇంకా మరికొన్ని పాపులర్ ఎస్‍యువిలు ఉన్నాయి. అదే సమయంలో, ప్రముఖ బ్రాండ్ అయిన మహీంద్రా, బొలెరో మరియు స్కార్పియో ఎలక్ట్రిక్ వెర్షన్‌లపై కూడా పనిచేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై కొత్త ఈవీలను తయారుచేయనున్న మహీంద్రా
ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ మహీంద్రా కొత్త ప్లాట్‌ఫారమ్ ఇంగ్లోపై తయారుచేయనున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌పై మహీంద్రా కంపెనీ బొలెరో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తయారుచేయనుంది. కానీ బొలెరో మరియు స్కార్పియో ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కార్లు కావు. దక్షిణాఫ్రికాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడిన థార్ ఎలక్ట్రిక్ బ్రాండ్ నుండి ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేస్తున్న మొదటి కారు బహుశా ఇదే కావచ్చు.
రాబోయే మూడేళ్లలో మరింతగా రానున్న కొత్త ఈవీలు
గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం నాడు, మహీంద్రా కంపెనీ తన ఐదు ఎలక్ట్రిక్ ఎస్‍యువిల గురించి వెల్లడించింది. ఇందులో XUV.e8, XUV.e9, BE.05, BE.07 మరియు BE.09 ఉన్నాయి. XUV.e8, XUV.e9, BE.05 మరియు BE.07లను 2024 లేదా 2026 సంవత్సరంలో లాంఛ్ చేయవచ్చు. అదే సమయంలో, BE.09 లాంచ్ టైమ్‌లైన్‌పై మహీంద్రా కంపెనీ ఎటువంటి సమాచారాన్ని పేర్కొనలేదు.
అలాగే XUV400, మహీంద్రా బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇది XUV300 యొక్క ఐసీఈ వెర్షన్ ఆధారంగా రూపొందించబడింది. కానీ ఈ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా & మహీంద్రా యొక్క బోర్న్ ఎలక్ట్రిక్ వాహనాల కిందకు రాదు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్